అఖిల్ అక్కినేని హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఏజెంట్.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఏజెంట్ సినిమా గురించి కొన్ని విషయాలను తెలియజేయడమే కాకుండా ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ గురించి కూడా పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ ఈ సినిమా షూటింగుకు దాదాపు రెండు సంవత్సరాలు సమయం పట్టిందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డికి కరోనా రావడంతో మరి కాస్త ఆలస్యం అయిందని తెలిపారు. ఇక ఈ సినిమా బడ్జెట్ గురించి అనిల్ సుంకర మాట్లాడుతూ…ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టే సమయంలో దాదాపు 45 కోట్ల బడ్జెట్ ఖర్చు అవుతుందని భావించాము. అయితే కరోనా కారణంగా ఈ సినిమా కోసం ఫైనాన్షియర్ దగ్గర తీసుకున్న డబ్బుకు వడ్డీ పెరగడంతో బడ్జెట్ రెండింతలు అయిందని తెలిపారు. ఇక ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి అఖిల్ పూర్తి రెమ్యూనరేషన్ కనుక తీసుకుంటే 100 కోట్ల బడ్జెట్ ఖర్చు అవుతుందంటూ ఈ సందర్భంగా అనిల్ సుంకర చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈయన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ అఖిల్ ను నమ్మి (Agent) ఈ సినిమా కోసం 100 కోట్ల బడ్జెట్ పెట్టారంటే ఇది మామూలు విషయం కాదని చెప్పాలి.ఈ సినిమా విషయంలో ఏ మాత్రం తేడా కొట్టిన నిర్మాత భారీగా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఇదివరకు అఖిల్ నటించిన సినిమాలలో ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించిన సందర్భాలు లేకపోవడంతో అఖిల్ ఏజెంట్ విషయంలో ఇలా భారీ బడ్జెట్ పెట్టి నిర్మాత రిస్క్ తీసుకున్నారనే చెప్పాలి. మరి ఈ సినిమా నిర్మాతకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో వేచి చూడాలి.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!