Aswani Dutt: కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. అశ్వినీదత్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 10 కోట్ల రూపాయలు లాభం రావడం కంటే కోటి రూపాయలు ఖర్చు చేసి 10 కోట్ల రూపాయలు వచ్చిన సినిమానే గొప్ప సినిమా అని భావిస్తారు. చిన్న సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో ఇప్పటికే పలు సినిమాలు ప్రూవ్ చేశాయి. వైజయంతీ బ్యానర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా అశ్వినీదత్  (C. Aswani Dutt)  ఒక ఇంటర్వ్యూలో పెళ్లిసందడి సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అశ్వినీదత్, అల్లు అరవింద్ (Allu Aravind) కలిసి 1996 సంవత్సరంలో రాఘవేంద్రరావు (Raghavendra Rao) డైరెక్షన్ లో శ్రీకాంత్ (Srikanth) హీరోగా పెళ్లి సందడి సినిమాను నిర్మించగా కోటీ 20 లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ఏకంగా 11 కోట్ల 30 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయట. అప్పట్లో టికెట్ రేట్లు 5 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఉండేవి. ఆ టికెట్ రేట్లతో ఈ స్థాయిలో కలెక్షన్లు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టైందో అర్థమవుతుంది.

పెట్టిన పెట్టుబడికి దాదాపుగా పది కోట్ల రూపాయల లాభం వచ్చిందని అశ్వినీదత్ పేర్కొన్నారు. అప్పట్లో ఈ సినిమా కొన్ని థియేటర్లలో 175 రోజులు కూడా ఆడింది. శ్రీకాంత్ కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. అప్పట్లో సంక్రాంతి పండుగ కానుకగా రిలీజై హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం ఈ సినిమాకు మరింత కలిసొచ్చింది. పెళ్లి సందడి ఒక విధంగా అప్పటో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందనే చెప్పాలి.

ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం పెళ్లిసందడి సినిమాను ఎంతో ఇష్టపడతారు. అశ్వినీదత్ ఈ ఏడాది కల్కి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఫుల్ రన్ లో 1100 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను క్రాస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అశ్వినీదత్ నిర్మాతగా రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను అందుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus