Nandita Swetha: ఆయన చెప్పినవన్నీ చేసిన సందర్భాలు లేవు: నందిత

నందిత శ్వేత అందరికీ సుపరిచితమే.కెరీర్ ప్రారంభం నుండీ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది ఈ అమ్మడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఆ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’ ‘బ్లఫ్ మాస్టర్’ ప్రేమ కథా చిత్రం 2′ ‘కల్కి’ ‘కపటదారి’ ‘అక్షర’ వంటి చిత్రాల్లో నటించింది. అవి ఈమెకు ఆశించిన ఫలితాలను అందించలేదు అనే చెప్పాలి. అందుకే ఈమె టాప్ ప్లేస్ కి చేరుకోలేకపోయింది.

ఇదిలా ఉండగా..ప్రముఖ కమెడియన్ , నిర్మాత , క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన బండ్ల గణేష్.. నందిత శ్వేతని ఓ విషయంలో చీట్ చేశాడట.తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పి అతను మాట తప్పినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. నందిత శ్వేత త్వరలో హిడింబ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జూలై 20 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా.. నందిత శ్వేత (Nandita Swetha) ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

ఓంకార్ హోస్ట్ చేసిన సిక్స్త్ సెన్స్ రియాలిటీ షో కోసం ఆమెను సంప్రదించినప్పుడు.. హిడింబ సినిమా గురించి, కథ గురించి చెప్పారట. అలా ఆమె ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అదే షో కి నందిత శ్వేత, బండ్ల గణేష్ తో కలిసి హాజరయ్యింది.ఈ క్రమంలో బండ్ల గణేష్ వల్ల నందిత గేమ్ ఓడిపోతుంది. ఆ టైంలో బండ్ల గణేష్.. నేను నిర్మించే సినిమాలో నువ్వే నా హీరోయిన్..

ఇప్పుడే మాటిస్తున్నాను..అంటూ చెప్పాడు. కానీ ఏడాది దాటినా అతను సినిమా చేసింది లేదు. నందిత కూడా బండ్ల గణేశ్ పై నమ్మకం లేనట్టు చెబుతుంది. అలా షోలలో పెద్దవాళ్ళు ఎన్నో చెబుతారు. అవన్నీ చేస్తారు అనేది తప్పు. అంటూ చెప్పుకొచ్చింది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus