ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాలపై, పవన్ రెమ్యునరేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు పెట్టిన ఖర్చు ఎంతో పవన్ రెమ్యునరేషన్ ఎంతో చెప్పాలని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దరిస్తానని చెబుతాడని పవన్ తక్కువ రేటుకే వినోదాన్ని పంచవచ్చు కదా? అంటూ మంత్రి ప్రశ్నించారు.
టికెట్ రేట్లు తగ్గితే తమ పారితోషికం తగ్గుతుందనే కారణంతో కొంతమంది అవాకులు చెవాకులు పేల్చుతున్నారని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. హీరోలకు తమ రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల నుంచి తగ్గుతోందనే బాధ ఉందని అంతకు మించి వాళ్ల ఆవేదనలో అర్థం లేదని మంత్రి తెలిపారు. తాను కూడా పవన్ కు అభిమానినని బైక్ అమ్మి పవన్ కు కటౌట్లు కట్టానని మంత్రి వెల్లడించారు.
అలా కటౌట్లు కట్టడం ద్వారా ఉన్న డబ్బులు ఊడగొట్టుకున్నానని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే అనిల్ చేసిన కామెంట్ల గురించి బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. “అందుకే రాష్ట్రానికి మంత్రి అయ్యావు అన్నా” అంటూ బండ్ల గణేష్ వేసిన కౌంటర్ వైరల్ అవుతోంది. మంత్రిని బండ్ల గణేష్ తిట్టారో పొగిడారో చాలామందికి అర్థం కావడం లేదు. పవన్ ఫ్యాన్ కాబట్టే అనిల్ కుమార్ మంత్రి స్థాయికి ఎదిగాడని బండ్ల గణేష్ పరోక్షంగా చెప్పుకొచ్చారు.
అయితే బండ్ల గణేష్ చేసిన కామెంట్ విషయంలో వైసీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఏపీలో తగ్గించిన టికెట్ రేట్లను అమలు చేయలేక విఎపిక్ థియేటర్ మూతబడింది. ఈ థియేటర్ యూవీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన థియేటర్ కావడం గమనార్హం. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ఈ థియేటర్ ఉంది. ఈ కాంప్లెక్స్ రూరల్ ఏరియాలో ఉండటంతో మూసేశారని సమాచారం. ప్రస్తుతానికి పెద్ద సినిమాల విడుదల లేకపోవడం వల్ల కూడా థియేటర్లను మూసివేస్తున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే సమయానికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాల్సి ఉంది.
అందుకే రాష్ట్రానికి మంత్రి అయ్యావ్ అన్నా #AnilkumarYadav 🙏 https://t.co/wIOZoEKQ6d
— BANDLA GANESH. (@ganeshbandla) December 24, 2021
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!