Bunny Vasu: ఎంతైనా ఊహించుకోండి.. అంతకుమించి ఉంటుంది.. బన్ని వాస్‌ హైప్‌ చూశారా?

కొంతమంది దర్శకుల సినిమాలు అయితే బ్లాక్‌బస్టర్‌ లేదంటే డిజాస్టర్‌ అనేలా ఉంటాయి. మధ్యస్తం వాళ్లు ఒక్క సినిమా కూడా చేయలేరు. అలాంటి దర్శకుల్లో త్రివిక్రమ్‌ ఒకరు. ఆయన సినిమాల కెరీర్‌ను చూస్తే ఇలానే అనిపిస్తుంది. అయితే డిజాస్టర్‌ / ఫ్లాప్‌ అనిపించుకున్న సినిమాలు టీవీల్లో వస్తే బాగా ఆడతాయి అనుకోండి. ఆ విషయం వదిలేస్తే రీసెంట్‌గా చేదు ఫలితం అందుకున్న త్రివిక్రమ్‌  (Trivikram) తర్వాతి సినిమా గురించి పెద్దగా చర్చలు లేవు.

అల్లు అర్జున్‌ (Allu Arjun) త్రివిక్రమ్‌ సన్నిహితుడు, నిర్మాత బన్ని వాస్‌ (Bunny Vasu)  ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి కొన్ని కామెంట్స్‌ చేశారు. దీంతో ఈ సినిమా గురించి చర్చలు మళ్లీ మొదలయ్యాయి. అల్లు అర్జున్‌తో నాలుగోసారి కొత్త సినిమా కోసం టీమ్‌ అప్‌ అవుతున్నారు త్రివిక్రమ్‌. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో ఎక్కడా సరైన సమాచారం లేదు. దాంతోపాటు సినిమా ఉందా? లేదా? అనే చిన్నపాటి డౌట్స్‌ కూడా ఉన్నారు.

వీటన్నింటిని బన్ని వాస్ క్లియర్‌గా క్లియర్‌ చేశారు. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడనంత గ్రాండియర్‌గా అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ సినిమా ఉంటుందని చెప్పారు. కథగా కన్నా కాన్సెప్ట్‌గా అద్భుతమైన సబ్జెక్టు రెడీ అవుతోందని కూడా చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో ఫైనాన్స్ తెచ్చుకునే రేంజ్‌లో నిర్మాతలు అల్లు అరవింద్  (Allu Aravind) , చినబాబు (Chinna Babu) ఈ సినిమా కోసం ఆలోచిస్తారు అని బడ్జెట్‌ గురించి హైప్‌ పెంచారు బన్ని వాస్‌.

అయితే సినిమా ఏ జానర్‌లో ఉంటుంది అనే విషయం మాత్రం ఆయన చెప్పలేదు. అయితే ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అంతకుమించి ఉంటుంది అని మాత్రం చెప్పారు. ఈ లెక్కన త్రివిక్రమ్ – బన్నీ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా టైం పడుతుంది. ప్రీ ప్రొడక్షన్‌కి ఏడాది దాటి పడుతుంది అని కూడా అంటున్నారు. అంటే ఈ రెండు మూడేళ్లలో సినిమా వచ్చే పరిస్థితి లేదు అని అనొచ్చు. ఈ లోపు బన్నీ మరో దర్శకుడుతో సినిమా చేసేయొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus