C Kalyan: ‘మా’ నిర్మాతల మండలి సభ్యుల మధ్య వాగ్వాదంతో మరోసారి వెలుగులోకి ‘మా’ రాజకీయాలు.!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా).. వెయ్యి మంది లోపు సభ్యులున్న దీని గురించి ఇండస్ట్రీ వర్గాల వారికి తప్ప బయట జనాలకు పెద్దగా తెలియదు కానీ.. గత ఎన్నికల సమయంలో ‘మా’ లో మామూలు రాజకీయాలుండవ్ అనే సంగతి అందరికీ తెలిసింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య పోటీ.. చిరంజీవి – బాలకృష్ణ మద్దతు.. సభ్యుల మధ్య మాటల యుద్ధాలు.. ఒకరిమీద ఒకరు తీవ్ర ఆరోపణలు.. సార్వత్రిక ఎన్నికలను తలపించాయి ‘మా’ ఎన్నికలు..

దీని తర్వాత అత్యంత కీలకమైనది, ప్రముఖమైనది.. నిర్మాతల మండలి.. ఇతర యూనియన్ సభ్యులు వేతనాలు పెంచమన్నప్పుడో, ధర్నాలప్పుడో, ఏదో సినిమా రిలీజులు, థియేటర్ల సమస్య, డిస్ట్రిబ్యూటర్లతో వివాదాల వంటి విషయాల్లో చర్చించడం తప్ప పెద్దగా మీడియా ముందు కనబడదు నిర్మాతల మండలి.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇద్దరు నిర్మాతల మధ్య వాదోపవాదాల కారణంగా ‘మా’ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోనూ పాలిటిక్స్ ఉన్నాయని తెలిసింది.. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా జరిగిన నిర్మాతల మండలి సమావేశంలో..

రెండేళ్లు దాటిపోయినా ఇంకా ఎందుకు ఎన్నికలు జరపలేదంటూ ప్రస్తుత ప్రెసిడెంట్ సి.కళ్యాణ్‌ను ఇతర సభ్యులు నిలదీశారు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న రవిచంద్ అనే మరో సభ్యుడు తన మొబైల్‌లో షూట్ చేస్తుండగా సి.కళ్యాణ్ చూసి.. ‘ఏయ్, ఎవరు నువ్వు? వీడియో ఎందుకు తీస్తున్నావ్?’ అంటూ అరిచాడు. అతను నేనూ మెంబర్‌నే అని చెప్పడంతో మరింత సీరియస్ అయిన సి.కళ్యాణ్.. ‘నిన్ను ఎప్పుడో పంపించేసుండాల్సింది.. నీలాంటి వల్గర్ క్యారెక్టర్‌ని మెంబర్‌గా చేర్చుకోవడమే తప్పు’.. అంటే..

ఆ వ్యక్తి కూడా.. ‘అవును సార్.. ఎవరు కూర్చుని వల్గర్ చేస్తున్నారో తెలుసు’ అనగా మాటా మాటా పెరగడం.. చివరికి ‘నువ్వు పనికిమాలిన మెంబర్‌‌వి’ అంటే.. ‘నువ్వే పనికిమాలిన ప్రెసిడెంట్‌వి’ అనుకునే స్థాయికి చేరుకుంది వ్యవహారం.. ఇతర సభ్యులు చెప్తున్నా వినిపించుకోకుండా.. సి.కళ్యాణ్, రవిచంద్ ఇద్దరూ ‘తగ్గేదే లే’ అనేలా అరుచుకున్నారు. ఈ వీడియో కాస్తా మీడియాలో ప్రత్యక్ష కావడంతో దీని గురించి ఫిలింనగర్‌తో పాటు నిర్మాతల మండలిలోనూ వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus