మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ నటించిన మొదటి బయోపిక్ మూవీ ఇది. అలాగే అతనికి ఇది మొదటి పాన్ ఇండియా మూవీ అని కూడా చెప్పొచ్చు. ఒకప్పుడు దేశాన్ని గజగజ వణికించిన స్టూవర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో ఈ మూవీ రూపొందింది. వంశీ ఈ చిత్రానికి దర్శకుడు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ ‘కార్తికేయ 2 ‘ వంటి పాన్ ఇండియా హిట్ సినిమాలను అందించిన అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
దీంతో ఈ సినిమా పై అంచనాలు ఇంకా పెరిగాయి అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. స్టూవర్టుపురం దొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు కానీ.. అది నిజం అనేలా ఒక్క ప్రూఫ్ కూడా లేదు. పైగా ‘స్టూవర్టుపురం’ కి చెందిన ప్రజలు కూడా ‘మేమంతా బాగున్న ఈ టైంలో మళ్ళీ ఇలాంటి సినిమా తీసి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు’ అంటూ నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సినిమాని నిలిపివేయాలి అంటూ వారు కోర్టుకెక్కడం కూడా జరిగింది. అలాంటప్పుడు ఈ సినిమాకి సెన్సార్ సమస్యలు ఏవీ తలెత్తలేదా అని కొందరు మీడియా సభ్యులు నిర్మాతని ప్రశ్నించడం జరిగింది. అందుకు ఆయన ‘ టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ కథని బయోపిక్ గా కాకుండా కొంత ఫిక్షన్ ను జోడించి కమర్షియల్ గా చెప్పడానికి ప్రయత్నించాం. అది అందరికీ నచ్చేలా ఉంటుంది కానీ ఇబ్బంది పెట్టేలా ఉండదు. అందుకే మా సినిమాకి సెన్సార్ సమస్యలు ఏవీ రాలేదు’ అంటూ అభిషేక్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!