రెండు ‘బాహుబలి’ (Baahubali) సినిమా వచ్చాక కూడా అభిమానుల ఆకలి తీరలేదు. మూడో ‘బాహుబలి’ (Baahubali 3) రావాల్సిందే అంటూ ముచ్చటపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు టీమ్ కూడా ఇదే ఆలోచనలో ఉందనే విషయం తరచుగా చెబుతూనే ఉంది. అయితే పక్కాగా ఇప్పుడు ఉంటుంది, అప్పుడు ఉంటుంది అని ఎక్కడా చెప్పడం లేదు. సినిమా టీమ్ మొత్తం ఇంచుమించు ఇలానే ఉంది. అయితే సినిమాను తమిళంలో రిలీజ్ చేసిన నిర్మాత జ్ఞానవేల్ K. E. Gnanavel Raja మాత్రం ఇటీవల సినిమా గురించి స్పందించారు.
‘బాహుబలి 3’ (Baahubali 3) ఉంది కానీ.. దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన అద్భుతం ‘బాహుబలి’ సినిమాలు. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమాల్లో ప్రభాస్ (Prabhas) , అనుష్క (Anushka Shetty) , రానా (Rana Daggubati) ప్రధాన పాత్రల్లో నటించారు. ‘కంగువ’ (Kanguva) సీక్వెల్స్ మధ్య అంత గ్యాప్ ఎందుకు అని ప్రశ్న వస్తే.. ఆయన మాట్లాడుతూ ‘బాహుబలి 3’ టాపిక్ ఇచ్చారు. ఇటీవల తాను ‘బాహుబలి’ సినిమా టీమ్‌తో మాట్లాడానని.. మూడో పార్టు ప్లాన్ చేసే పనిలో ఉన్నామని వాళ్లు చెప్పారని తెలిపారు.
అయితే ప్రభాస్‌కు ఆ సినిమా కంటే ముందు నాలుగు సినిమాలు ఉన్నాయని చెప్పారు. అవన్నీ అయ్యాకే ‘బాహుబలి 3’ ఉంటుంది అని తెలిపారు. ఆయన చెప్పినట్లు 4 సినిమాలు కాదు కానీ.. ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ‘బాహుబలి 3’ ఉన్నా.. ఇంత త్వరగా అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజమౌళి (S. S. Rajamouli) కూడా మహేశ్ సినిమాతో బిజీగా ఉన్నారు.
అమెజాన్ అడవుల నేపథ్యంలో రూపొందుతుందని తెలిసిన ఈ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుంది అని చెబుతున్నారు. కనీసం రెండు, మూడేళ్లు ఈ సినిమాకు సమయం పట్టొచ్చు అని చెబుతున్నారు. కాబట్టి ‘బాహుబలి 3’ ఏ లెక్కన చూసినా ఇప్పట్లో వచ్చేదే లేదు. అన్నట్లు ‘ఆర్‌ఆర్‌ఆర్ 2’ కూడా ఉందని ఆ మద్య అన్నారు. మరి అదెప్పుడో?