Raja The Great: బ్లాక్‌బస్టర్‌ సినిమా తొలుత రామ్‌ దగ్గరకే వెళ్లింది.. ఆయన నో చెప్పాడట!

ఇది చాలా ఏళ్ల క్రితం నాటి మాట. ‘నేను శైలజ’ సినిమాతో రామ్‌ ఎన్నాళ్లో వేచిన విజయం అందుకున్న రోజులవి. ఆ సమయంలో ఆయనతో అనిల్‌ రావిపూడి ఓ సినిమా చేస్తారు అని వార్తలొచ్చాయి. సినిమా మొదలుపెట్టాస్తారు అనే మాటలు కూడా వినిపించాయి. అయితే కథ విషయంలో ఇబ్బందులు వచ్చిన ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే వీటిలో అన్నీ సమాచారాలు.. ఎక్కడా ఎలాంటి క్లారిటీలు లేవు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్‌ గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.

Raja The Great

రవితేజతో అనిల్‌ రావిపూడి చేసిన ‘రాజా ది గ్రేట్‌’ సినిమా కథ తొలుత రామ్‌కి చెప్పారట. తొలుత అంతా ఓకే అనుకుని ముందుకెళ్లిన ఈ ప్రాజెక్ట్‌ విషయంలో ఆ తర్వాత వచ్చిన కొన్ని క్రియేటివ్‌ డిఫరెన్స్‌ల వల్ల ఆగిపోయారట. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్‌ రావిపూడినే చెప్పుకొచ్చారు. రామ్‌ వెనక్కి తగ్గడంతో సినిమాను రవితేజతో చేశామని తెలిపారు. దీంతో ‘రాజా ది గ్రేట్’ (Raja The Great) సినిమాను ఎలా మిస్ చేసుకున్నావ్ అంటూ రామ్‌ను అడుగుతున్నారు ఫ్యాన్స్‌.

సగటు టాలీవుడ్‌ హీరోలు ఇలాంటి కథలు చేయడానికి ఒప్పుకోని పరిస్థితి ఇప్పటికీ ఉంది. అయితే ప్రయోగానికి ఫిదా అయ్యి రవితేజకు విజయం అందించారు. అయితే ‘రాజా ది గ్రేట్’ కథను యాజ్‌ ఇట్‌ ఈజ్‌ రామ్‌కి చెప్పలేదట. అప్పటి వెర్షన్ వేరట. ఇప్పుడున్న వెర్షన్‌లో ఓ అమ్మాయిని కాపాడే బ్లైండ్ కుర్రాడి కథను చూపించారు. గతంలో జరిగిన ఓ విషయానికి ప్రస్తుతానికి లింక్‌ పెట్టారు.

కానీ రామ్‌కి చెప్పిన కథలో ఫక్తు ప్రేమ కథ ఉండేదట. డార్జిలింగ్‌లో మొదలయ్యే పాత వెర్షన్‌లో హీరో బ్లైండ్.. ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాక ప్రాబ్లెమ్ వస్తే.. ఎలా సాల్వ్ చేశాడనేది అప్పటి కథ. అయితే కథ నచ్చకనో, టెక్నికాలిటీస్‌ నచ్చకనో అప్పట్లో రామ్‌ వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత ‘హైపర్‌’ సినిమాను ఓకే చేసుకొని సెట్స్‌పైకి తీసుకొచ్చారు.

స్టార్ హీరోయిన్ ను 8 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus