తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి మారనుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. ‘తెలుగు సినిమా పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలుకుతుంది’ అంటూ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించడంతో దీనిపై చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇందుకు సినీ పరిశ్రమకు చెందిన వారు సముఖంగా లేరు. 1970 ల టైంలో మద్రాసు నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది తెలుగు సినీ పరిశ్రమ. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి.
పైగా సీనియర్ నటీనటులు, నిర్మాతలు వంటి వారు ఇక్కడ చాలా ఆస్తులు సంపాదించుకున్నారు. సో అంత ఈజీగా మొత్తం ఆంధ్రాకి మారిపోవడం అనేది సాధ్యం కాదు. ఇటీవల ‘ఓ సీనియర్ హీరో ప్రోపర్టీ కూల్చివేసి, మరో స్టార్ హీరోని జైలుకి పంపించి’ తెలంగాణ ప్రభుత్వం సినిమా వాళ్ళపై ఫోకస్ పెట్టిందని.. కాబట్టి మిగిలిన వారు తెలంగాణ ప్రభుత్వం భారిన పడకుండా ఆంధ్రాకి వచ్చేయాలని’ ఏపీ అధికార పార్టీకి చెందిన వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) వద్ద ప్రస్తావించగా.. “నేను ఇక్కడ ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్లి నేనేం చేస్తాను” అంటూ ప్రశ్నించారు. అలాగే ‘సీఎం ముఖ్యమంత్రిని సినిమా వాళ్ళు ఎందుకు ఇప్పటివరకు కలవలేదు? ఇప్పుడైనా కలిసే అవకాశం ఉందా?’ అనే అంశం పై కూడా నాగవంశీని మీడియా ప్రశ్నించడం జరిగింది. ‘ఎఫ్.డి.సి చైర్మన్ అయినటువంటి దిల్ రాజు (Dil Raju) గారు ఇండియాకు వచ్చిన తర్వాత.. అందరం సమావేశమై దీని గురించి చర్చిస్తాం.
ఆయన డెసిషన్ ప్రకారం నడుచుకుంటాం’ అంటూ నాగ వంశీ సమాధానం ఇవ్వడం జరిగింది. అంతేకానీ.. ‘మేము కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాము’ అని మాత్రం నాగవంశీ చెప్పకపోవడం గమనార్హం. నాగ వంశీ కామెంట్స్ సంగతి ఎలా ఉన్నా.. అతి త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పాలి.
నేను ఇక్కడ చాలా ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నా.. ఆంధ్రాకెళ్ళి నేనేమి చేస్తాను : నాగవంశీ#Nagavamsi #PawanKalyan #DirectorBobby #DaakuMaharaaj #Balakrishna pic.twitter.com/ipP8Hx7FqU
— Filmy Focus (@FilmyFocus) December 23, 2024