Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » ఇంటర్వ్యూలు » ఇంటర్వ్యూ : ‘స్వాతి ముత్యం’ మూవీ గురించి నిర్మాత నాగ వంశీ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

ఇంటర్వ్యూ : ‘స్వాతి ముత్యం’ మూవీ గురించి నిర్మాత నాగ వంశీ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

  • October 1, 2022 / 08:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంటర్వ్యూ : ‘స్వాతి ముత్యం’  మూవీ గురించి నిర్మాత నాగ వంశీ చెప్పిన ఆసక్తికర విషయాలు..!

‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కి హోమ్ బ్యానర్ అయిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ పై వరుస సినిమాలు నిర్మిస్తూ హిట్లు మీద హిట్లు కొడుతున్నారు సూర్యదేవర నాగ వంశీ. ఈ ఏడాది ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలతో బ్లాక్ బస్టర్ లు అందుకుని ఫుల్ ఫామ్లో ఉన్నారు ఆయన. ఆయన బ్యానర్ నుండి రాబోతున్న మరో మూవీ ‘స్వాతిముత్యం’. బెల్లంకొండ సాయి గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ మూవీకి లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడు.ఇతనికి ఇదే మొదటి చిత్రం. విజయదశమి కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ ప్రమోషన్లలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

‘స్వాతిముత్యం’ సినిమా ఎలా ఉండబోతుంది? ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది?

ఇదొక ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. థియేటర్ నుండి ప్రేక్షకులు బయటకు వచ్చేప్పుడు హాయిగా నవ్వుకుంటూ వస్తారు. అద్భుతం తీశాం, అవార్డులు వచ్చే సినిమా తీశామని నేను చెప్పను. పండగ రోజు థియేటర్ కి వస్తే మాత్రం గ్యారంటీగా నవ్వుకునే బయటకు వస్తారు.

ఈ సినిమా పై అంత కాన్ఫిడెన్స్ ఏంటి?

ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఇందులో మేము టచ్ చేశాం. ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ని ఫన్ టోన్ లో చెప్పాం.అందువల్ల ఇది ఫ్రెష్ గా అనిపిస్తుంది.

లక్ష్మణ్ కొత్త దర్శకుడు కదా.. మీరేమైనా సూచనలు ఇచ్చారా?

ఇప్పుడు వస్తున్న కొత్త డైరెక్టర్లు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. లక్ష్మణ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా తాను అనుకున్నది తీశాడు. మేం చిన్న చిన్న సలహాలు ఇచ్చాం.

ఈ మూవీ కథ విషయంలో త్రివిక్రమ్ గారు ఏమైనా సూచనలు ఇచ్చారా?

ఆయనకు కథ, స్క్రిప్ట్ చూపించకుండా మా సినిమా మొదలవ్వదు.

‘గాడ్ ఫాదర్’, ‘ఘోస్ట్’ సినిమాలతో పాటు రిలీజ్ చేస్తున్నారు. కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ వంటిది లేదండి. నేను మొన్న కూడా చెప్పాను. కోవిడ్ తర్వాత ప్రతివారం కనీసం రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. పైగా దసరా సీజన్ కాబట్టి రెండు సినిమాలున్నా రిస్క్ తీసుకుంటున్నాం.

చిరంజీవి గారు తన సినిమా ఫంక్షన్లో మీ సినిమా గురించి కూడా ప్రస్తావిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు కదా.. దానికి మీ ఫీలింగ్ ఏంటి?

అందుకే ఆయన చిరంజీవి గారు అయ్యారు. చిన్న సినిమాలను ఆదరించమని కోరతారు. చిన్న సినిమాలను అభినందిస్తారు. అందుకే ఆయన ఇండస్ట్రీ పెద్ద అయ్యారు.

‘స్వాతి ముత్యం’ టైటిల్ పెట్టడానికి కారణమేంటి? టైటిల్ పెట్టేముందు బాగా ఆలోచించారా?

హీరో క్యారెక్టర్ అమాయకంగా ఉంటుంది కాబట్టి స్వాతిముత్యం టైటిల్ సరిగ్గా సరిపోతుందని పెట్టాం. పైగా చిన్న సినిమాకి క్లాసిక్ ఫిల్మ్ టైటిల్ పెడితే మా సినిమా ప్రేక్షకులలోకి త్వరగా వెళ్తుందన్న నమ్మకం, ఉద్దేశంతో పెట్టాం. అయితే సినిమా చూశాక ఇది యాప్ట్ టైటిల్ అని అందరికీ అనిపిస్తుంది.

‘స్వాతి ముత్యం’ అంటే అమాయకుడా? పిచ్చోడా?

పిచ్చోడు కాదు అమాయకుడు. ఈ జనరేషన్ లో ఉండాల్సిన వాడు కాదు. చాలా మంచోడు. శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో హీరోలా అన మాట.

ఈ మధ్య కాలంలో ఇది బెస్ట్ కంటెంట్ అని ఫీలైతేనే జనాలు థియేటర్ కు వెళ్తున్నారు? మీ చిత్రం ఆదరణ పొందుతుంది అనే నమ్మకం మీకు ఉందా?

బింబిసార, సీతా రామం, కార్తికేయ -2 సినిమాలు వేటికవే భిన్నమైనవి. అన్నీ ఆదరణ పొందాయి. అలాగే ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా పెద్దగా రాలేదు. డీజే టిల్లు తర్వాత ఇదే అనుకుంటున్నా. అలా అని కేవలం ఎంటర్టైనర్ మాత్రమే కాదు కొత్త కాన్సెప్ట్ కూడా ఉంది. కాబట్టి ప్రేక్షకులను థియేటర్ కు రప్పించే సినిమానే అని నమ్మాము.

వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా ఎంపిక చేయడానికి కారణం?

‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ లో చూసినప్పుడు ఆమె నటన నచ్చింది. అది చూసి ఎంపిక చేశాం. దీనిలో కూడా ఒక స్మాల్ టౌన్ అమ్మాయి క్యారెక్టర్. ఆ పాత్రకి ఆమె సరిగ్గా సరిపోతుంది అని సినిమా చూశాక మీకే అర్థమవుతుంది.

ఈ ఫిల్మ్ గణేష్ కి మంచి లాంచ్ అవుతుంది అనుకుంటున్నారా?

బెల్లంకొండ సురేష్ గారు తన పెద్దబ్బాయిని సమంతను హీరోయిన్ గా పెట్టి గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇది అలా కాదు. ఈ సినిమాతో గణేష్ మంచి కాన్సెప్ట్ తో వచ్చాడన్న పేరు వస్తుంది.

స్వాతిముత్యం నుంచి ఇక సితారలో ప్రయోగాత్మక చిత్రాలు ఆశించవచ్చా?

డీజే టిల్లు నుంచే చేశాం కదా. అన్ని రకాలు చిత్రాలు చేస్తాం. టిల్లు, వరుడు కావలెను, స్వాతిముత్యం ఇలా చిన్న చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ బాలకృష్ణ గారు, రవితేజ గారు, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలతో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాం. అలాగే ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీతో తారక్ గారి బావమరిదిని లాంచ్ చేస్తున్నాం.

చిరంజీవి గారితో ఎప్పుడు ఉండొచ్చు ప్రాజెక్ట్?

నేను కూడా వెయిటింగ్. త్వరగా ఆయనతో సినిమా చేయాలని.!

మహేష్ బాబు గారి సినిమా ఎలా ఉండబోతుంది?

త్రివిక్రమ్, మహేష్ గారి కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలకు థియేటర్స్ లో రావాల్సినంత ఆదరణ రాలేదు. కానీ టీవీల్లో పిచ్చి పిచ్చిగా చూశారు. ఆ కాంబినేషన్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ కాంబినేషన్లో మా బ్యానర్లో రాబోయే మూవీ ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకొని జనాలు థియేటర్ కి వస్తారో అంతకు మించి ఉంటుంది మూవీ..!

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ganesh
  • #Lakshman K Krishna
  • #Naga Vamsi
  • #Swathimuthyam
  • #varsha bollamma

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

3 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

6 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

6 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

7 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

8 hours ago

latest news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

1 hour ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

2 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

3 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

4 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version