పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ ఈ నెల 25వ తేదీ లేదా ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ కానుంది. ఏప్రిల్ 1వ తేదీన భీమ్లా నాయక్ రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డీజే టిల్లు సినిమా ఈవెంట్ లో నాగవంశీ సీఎం జగన్ గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.
భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ ఎప్పుడో సీఎం జగన్ గారిని అడగాలని నాగవంశీ చేసిన కామెంట్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో నాగవంశీ ఆ కామెంట్ల గురించి మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా నిబంధనలను ఎప్పుడు తొలగిస్తే అప్పడే సినిమా రిలీజ్ అని తాను వెల్లడించానని నాగవంశీ చెప్పుకొచ్చారు.
అయితే నేను చేసిన కామెంట్ వివాదంగా మారిందని నాగవంశీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని, కరోనా పరిస్థితులను పరిశీలించి సినిమా రిలీజ్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని నాగవంశీ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తమ సినిమాకు ఎలాంటి సమస్య లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నాగవంశీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లో పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. భీమ్లా నాయక్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగిన విధంగా ఈ సినిమా కథలో కీలక మార్పులు చేశారు. రీఎంట్రీలో వకీల్ సాబ్ తో సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో మరో విజయాన్ని సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. 120 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!