ఆ మధ్య కొన్ని నెలల క్రితం ‘డెవిల్’ (Devil) అనే సినిమా వచ్చింది మీకు గుర్తుండే ఉంటుంది. ఫలితం బట్టి సినిమా ఎంత గుర్తుందో తెలియదు కానీ.. ఆ సినిమాకు అయిన పంచాయితీ వల్ల ఎక్కువ గుర్తుంటుంది. ఎందుకంటే ఆ సినిమాకు నవీన్ మేడారం దర్శకుడు. నిర్మాణ సంస్థ కొన్ని విబేధాలు రావడం వల్ల, ఆయన ప్రాజెక్టు నుండి తప్పుకొన్నారు. దీంతో నిర్మాత అభిషేక్ (Abhishek Nama) దర్శకుడిగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా?
Peddha Kapu
ఎందుకంటే అలా అనుకోకుండా దర్శకుడు అయితే అభిషేక్ నామా ఇప్పుడు ఓ పూర్తి స్థాయి దర్శకుడిగా మారబోతున్నారు అని టాక్. అభిషేక్ దగ్గరకు ఇటీవల ఓ మంచి కథ వచ్చిందట. ఆ కథని నిర్మాతగా సెట్స్ పైకి తీసుకెళ్దామనుకొన్నారు. కానీ ఇప్పుడు దర్శకుడిగా సినిమాను హ్యాండిల్ చేస్తారు అని తెలుస్తోంది. అంతేకాదు నిర్మాత ఆయన కాదట. ‘అఖండ’ (Akhanda) , ‘జయ జానకి నాయక’ (Jaya Janaki Nayaka) ‘పెదకాపు’ చిత్రాల్ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి (Miryala Ravinder Reddy) ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తారట ‘పెదకాపు 1’ (Peddha Kapu 1) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విరాట్ కర్ణనే (Virat Karrna) ఈ సినిమాలో హీరో అని అంటున్నారు.
రావడం రావడమే రెండు పార్టుల సినిమా అంటూ ఊరించిన విరాట్ కర్ణ తొలి పార్టు ఇచ్చిన ఝలక్‌కి అక్కడితో ఆపేశారు. మరిప్పుడు ఈ సినిమా సంగతి చూడాలి. ఇలా నిర్మాతలు దర్శకుడిగా మారడం ఇదేం తొలిసారి కాదు. కొన్నేళ్ల క్రితం ‘యాక్షన్ త్రీడీ’ (Action 3D) సినిమాతో అనిల్ సుంకర (Anil Sunkara) ఇలానే దర్శకుడిగా మారారు. అయితే ఆ సినిమా ఫలితం గురించి మాట్లాడుకోకపోతే అంత మంచిది.
అంతేకాదు ఆ సినిమా తర్వాత నిర్మాతగానూ ఆయన సరైన ఫలితాలు అందుకోలేకపోయారు. ఇప్పుడలా అవుతుంది అని అనుకోకూడదు కానీ.. అభిషేక్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడమే మా ఉద్దేశం. చూద్దాం మరి ఆయన ఎలాంటి కథ ఎంచుకున్నారో? ఎలా చేస్తారో?