దర్శకుడిగా మారుతున్న నిర్మాత.. అయితే నిర్మాత వేరొకరు… ఎవరంటే?

ఆ మధ్య కొన్ని నెలల క్రితం ‘డెవిల్‌’ (Devil) అనే సినిమా వచ్చింది మీకు గుర్తుండే ఉంటుంది. ఫలితం బట్టి సినిమా ఎంత గుర్తుందో తెలియదు కానీ.. ఆ సినిమాకు అయిన పంచాయితీ వల్ల ఎక్కువ గుర్తుంటుంది. ఎందుకంటే ఆ సినిమాకు న‌వీన్ మేడారం ద‌ర్శ‌కుడు. నిర్మాణ సంస్థ కొన్ని విబేధాలు రావ‌డం వ‌ల్ల‌, ఆయ‌న ప్రాజెక్టు నుండి త‌ప్పుకొన్నారు. దీంతో నిర్మాత అభిషేక్‌ (Abhishek Nama) ద‌ర్శ‌కుడిగా అవ‌తారం ఎత్తాల్సి వ‌చ్చింది. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా?

Peddha Kapu

ఎందుకంటే అలా అనుకోకుండా దర్శకుడు అయితే అభిషేక్‌ నామా ఇప్పుడు ఓ పూర్తి స్థాయి ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్నారు అని టాక్‌. అభిషేక్ ద‌గ్గ‌ర‌కు ఇటీవ‌ల‌ ఓ మంచి క‌థ వ‌చ్చిందట. ఆ కథ‌ని నిర్మాత‌గా సెట్స్ పైకి తీసుకెళ్దామ‌నుకొన్నారు. కానీ ఇప్పుడు దర్శకుడిగా సినిమాను హ్యాండిల్‌ చేస్తారు అని తెలుస్తోంది. అంతేకాదు నిర్మాత ఆయన కాదట. ‘అఖండ‌’ (Akhanda) , ‘జయ జానకి నాయక’ (Jaya Janaki Nayaka) ‘పెదకాపు’ చిత్రాల్ని నిర్మించిన మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి (Miryala Ravinder Reddy) ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తారట ‘పెద‌కాపు 1’ (Peddha Kapu 1) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విరాట్ క‌ర్ణ‌నే (Virat Karrna) ఈ సినిమాలో హీరో అని అంటున్నారు.

రావడం రావడమే రెండు పార్టుల సినిమా అంటూ ఊరించిన విరాట్‌ కర్ణ తొలి పార్టు ఇచ్చిన ఝలక్‌కి అక్కడితో ఆపేశారు. మరిప్పుడు ఈ సినిమా సంగతి చూడాలి. ఇలా నిర్మాతలు దర్శకుడిగా మారడం ఇదేం తొలిసారి కాదు. కొన్నేళ్ల క్రితం ‘యాక్షన్‌ త్రీడీ’ (Action 3D) సినిమాతో అనిల్‌ సుంకర (Anil Sunkara) ఇలానే దర్శకుడిగా మారారు. అయితే ఆ సినిమా ఫలితం గురించి మాట్లాడుకోకపోతే అంత మంచిది.

అంతేకాదు ఆ సినిమా తర్వాత నిర్మాతగానూ ఆయన సరైన ఫలితాలు అందుకోలేకపోయారు. ఇప్పుడలా అవుతుంది అని అనుకోకూడదు కానీ.. అభిషేక్‌ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడమే మా ఉద్దేశం. చూద్దాం మరి ఆయన ఎలాంటి కథ ఎంచుకున్నారో? ఎలా చేస్తారో?

మోక్షజ్ఞ సినిమా లాంచ్‌ అప్పుడే? బాలకృష్ణ ఇంకా ఏం చెప్పారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus