పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి హర్రర్ అండ్ రొమాంటిక్ మూవీగా ‘ది రాజాసాబ్’ రానున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యింది.
ఇండియా వైడ్ దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు కూడా టీజర్ ద్వారా ప్రకటించారు. అయితే ఈ మధ్య ప్రతి పెద్ద సినిమాకి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘ది రాజాసాబ్’ కి కూడా సీక్వెల్ ఉంటుందేమో అని కొందరు భావిస్తున్నారు. దానికి నిర్మాత విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చేశారు.
‘ది రాజాసాబ్’ గురించి నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 5 నే విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ‘చాలా మంది అభిమానులు 2026 సంక్రాంతికి వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు. కానీ డిసెంబర్ ఫస్ట్ వీకెండ్ కు హిందీ మార్కెట్ బాగుంటుంది. అక్కడ రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ పోటీగా ఉన్నప్పటికీ.. మా సినిమాకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు.సో ఇబ్బంది లేకుండా మా డెసిషన్ మేము తీసుకునే ఫ్రీడమ్ ఉంది’ అంటూ విశ్వప్రసాద్ తెలియజేశారు.
మరోపక్క ‘ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో పెద్ద ప్రాజెక్టులు ఏమీ కనిపించడం లేదు కదా’ అంటూ విశ్వప్రసాద్ ను ప్రశ్నించగా.. అందుకు ఆయన ‘ ‘ది రాజాసాబ్ 2′ ఉంటుంది. కాకపోతే ఈ కథకి కంటిన్యూషన్ గా కాదు.. మల్టివర్స్ స్టైల్లో ట్రై చేయబోతున్నాం. దర్శకులు మారుతి వద్ద కూడా సబ్జెక్ట్ ఉంది’ అంటూ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకొచ్చారు నిర్మాత విశ్వప్రసాద్.