Yashoda: సమంత సై అంటే యశోద3 కూడా వస్తుందా?

హరి హరీష్ డైరెక్షన్ లో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద మూవీ ప్రస్తుతం థియేటర్లలో సకెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సమంత అభిమానులతో పాటు కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కు ఈ సినిమాతో చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలు వచ్చాయి. ఈ సినిమా సక్సెస్ మీట్ లో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ యశోద మూవీకి సీక్వెల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

సమంత నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే యశోద సినిమాకు సీక్వెల్ ను నిర్మించడానికి తాను సిద్ధమేనని ఆయన అన్నారు. కొత్త కొత్త నేరాలు వెలుగులోకి రావడంతో పాటు అదే సమయంలో ఆ నేరాలకు పరిష్కార మార్గాలు కూడా తెలుస్తున్నాయని ఆయన కామెంట్లు చేశారు. యశోద సినిమాకు సీక్వెల్ గా యశోద2 తెరకెక్కించాలని అనుకుంటే ఆ సినిమాకు కథ విషయంలో కూడా ఎలాంటి సమస్య లేదని ఆయన అన్నారు. దర్శకులు హరి హరీశ్ మాట్లాడుతూ యశోద2 సినిమాతో పాటు యశోద3 సినిమాను తెరకెక్కించడానికి కూడా తమ దగ్గర అద్భుతమైన కాన్సెప్ట్ ఉందని చెప్పుకొచ్చారు.

సమంత అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత ఆమెకు కథలు చెబుతామని హరి హరీశ్ వెల్లడించారు. యశోదకు సీక్వెల్ లో నటించే అవకాశం వస్తే సమంత ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాలు సక్సెస్ సాధించిన సందర్భాలు చాలా తక్కువనే సంగతి తెలిసిందే.

ఫస్ట్ పార్ట్ ను మించిన కథతో తెరకెక్కితే మాత్రమే సీక్వెల్ సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సమంత నటించిన శాకుంతలం సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా త్రీడీకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus