లాక్ వల్ల మిగిలిపోయిన సినిమా షూటింగ్ ల ప్రాగ్రెస్..!

2020 మొదటి నెలలలోనే సంక్రాంతి సినిమాలు అదిరిపోయే కలెక్షన్లు రాబట్టి.. శుభారంభాన్ని ఇచ్చాయి. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ .. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు .. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాయి. ఇక ఫిబ్రవరి నెలలో కూడా ‘భీష్మ’ ‘హిట్’ వంటి చిత్రాలు మంచి వసూళ్ళను రాబట్టాయి. దాంతో సంక్రాంతి రేంజ్లో.. సమ్మర్ లో రాబోతున్న చిత్రాలు కూడా భారీ వసూళ్ళను నమోదు చేస్తాయి అని ప్రేక్షకులు, నిర్మాతలు భావించారు. కానీ అందరి ఆశలు తలక్రిందులు అయిపోయాయి.

ఓ మహమ్మారి వైరస్ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. అంతేకాదు రిలీజ్ కు రెడీ అయిన ‘వి’ వంటి క్రేజీ మల్టీ స్టారర్ సినిమా ఆగిపోయింది. అంతేకాదు అసలు సినిమాల విడుదల లేకుండానే సమ్మర్ ముగిసిపోతుందని చెప్పాలి. ఇక స్టార్ హీరోల సినిమాలు, మీడియం హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు.. అనే తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగ్ లు నిలిచిపోయాయి. అయితే షూటింగ్ ఆగిపోయిన సినిమాల.. వర్క్ ఎంతెంత బ్యాలన్స్ ఉంది అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) క్రాక్ : రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకో 10శాతం షూటింగ్ బ్యాలన్స్ ఉంది.

2) లవ్ స్టోరీ : శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కూడా 10 షూటింగ్ బ్యాలన్స్ ఉంది.

3) విరాట పర్వం : వేణు అడుగుల డైరెక్షన్లో రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రం మరో 10 శాతం షూటింగ్ బ్యాలన్స్ ఉంది.

4) శ్రీకారం : శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 20శాతం బ్యాలన్స్ ఉంది.

5) వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మరో 25 శాతం బ్యాలన్స్ ఉంది.

6) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ : అఖిల్, పూజా హెగ్దే జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మరో 25శాతం బ్యాలన్స్ ఉంది.

7) ఆర్.ఆర్.ఆర్ : రాజమౌళి డైరెక్షన్లో చరణ్,ఎన్టీఆర్ లు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మరో 30శాతం బ్యాలన్స్ ఉంది.

8) నారప్ప : వెంకటేష్ నటిస్తున్న ‘అసురన్’ రీమేక్ షూటింగ్ కూడా 30 శాతం బ్యాలన్స్ ఉంది.

9) ప్రభాస్ 20 : రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ 70శాతం బ్యాలన్స్ ఉంది.

10) రంగ్ దే : వెంకీ అట్లూరి డైరెక్షన్లో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 40 శాతం బ్యాలన్స్ ఉంది.

11) వైల్డ్ డాగ్ : నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50శాతం బ్యాలన్స్ ఉంది.

12) ఆచార్య : కొరటాల -చిరు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ 60 శాతం బ్యాలన్స్ ఉంది.

13) ఫైటర్ : పూరి జగన్నాథ్ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ 60 శాతం బ్యాలన్స్ ఉంది.

14) టక్ జగదీష్ : నాని -శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ 60 శాతం బ్యాలన్స్ ఉంది.

15) ఉప్పెన : మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 5 శాతం బ్యాలన్స్ ఉంది.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus