సుమంత్ సినిమాకి భారీ ప్రచారం..!

దాదాపు రెండేళ్ల తర్వాత తెరమీదికొస్తున్నాడు సుమంత్. హిందీ సినిమా సుమంత్ హీరోగా ‘విక్కీ డోనర్’ సినిమాని ‘నరుడా.. డోనరుడా’ పేరుతో మల్లిక్ రామ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సుమంత్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరి విడుదల అంటే ప్రచారం ఉండాలిగా..? నిర్మాతగా మారాడన్న కారణమో ఏమో గానీ ప్రచారం విషయంలో సుమంత్ పక్కగా ఉన్నాడు.

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినీ జనాలను బాగా ఆకర్షించాయి. మరోవైపు ఈ టైటిల్ వెనుక రాజమౌళి ‘రాజముద్ర’ ఉందన్న సంగతి ఆనోటా ఈనోటా బాగానే పాకింది. ‘మజ్ను’ సినిమా విరామ సమయంలో ప్రదర్శితమైన ‘టీజర్’ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు వీటన్నిటినీ మించి మహేశ్ బాబు రూపంలో ఈ సినిమాకి భారీ ప్రచారం లభించనుంది.రేపు (సెప్టెంబర్ 27) సాయంత్రం మహేశ్ బాబు ఈ సినిమా ట్రైలర్ ని ఆవిష్కరించనున్నారు. చాన్నాళ్ల తర్వాత బాక్సాఫీస్ పోరుకి వస్తున్న ఈ అక్కినేని కథానాయకుడు ఈసారి నటుడిగా, నిర్మాతగా గెలిచేలా ఉన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus