ఒకరోజు ముందే వస్తానంటున్న అజ్ణాతవాసి!

  • October 24, 2017 / 03:54 AM IST

ఇవాళ ఎన్టీయార్ తాజా చిత్రం ఓపెనింగ్ విచ్చేసి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తోపాటు నందమూరి అభిమానులను కూడా ఆనందపరిచిన పవన్ కళ్యాణ్ మరోమారు ఆదేస్థాయిలో తన ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. హారికా అండ్ హాసిని ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న “అజ్ణాతవాసి” (వర్కింగ్ టైటిల్) సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత సారధ్యం వహిస్తున్నాడు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం “అజ్ణాతవాసి” (వర్కింగ్ టైటిల్) రిలీజ్ విషయంలో స్వల్ప మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. “బాహుబలి, అర్జున్ రెడ్డి” చిత్రాల తరహాలో పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా ముందు రోజు అనగా జనవరి 9న పెయిడ్ ప్రీమియర్స్ వేయనున్నారని వినికిడి. ఈమధ్యకాలంలో అవుటాఫ్ హైద్రాబాద్ పర్లేదు కానీ.. హైద్రాబాద్ లో మాత్రం పోలీసులు కారణాంతరాల వలన బెనిఫిట్ షోస్ కు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఆ కారణంగా అభిమానులు కూడా రెగ్యులర్ ఆడియన్స్ వలె ఉదయం పూటే సినిమా చూడాల్సి వస్తుంది. తమ అభిమాన హీరో నటించిన సినిమాని నార్మల్ గా చూస్తే ఏం మజా ఉంటుంది చెప్పండి. అందుకే త్రివిక్రమ్ ఈ ముందురోజు ప్రీమియర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదేగనుక నిజమైతే.. పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus