జులై 8న ప్ర‌భాస్‌ “సాహొ ” ఫ‌స్ట్ సింగిల్‌!

‘బాహుబలి చిత్రం తరువాత ప్ర‌పంచం లో వున్న యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ అభిమానుల చూపంతా సాహో వైపు తిరిగింది. సాహో అప్‌డేట్స్ గ్యాప్ లేకుండా రావ‌డం తో అభిమానుల చాలా ఆనందంగా వున్నారు. సోష‌ల్‌ మీడియా లో అయితే వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో సినిమా నెక్ట్స్ అప్‌డేట్ కొసం సెర్చ్ విప‌రీతంగా జ‌రుగుతుంది. ఈసారి చిత్ర యూనిట్ సాంగ్ టీజ‌ర్ ఇచ్చి పూర్తి సాంగ్ ని జులై 8న విడుద‌ల చేస్తున్నాము అని ఎనౌన్స్ చేసింది. దీంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు. వీరి చూపంతా ఇప్పుడు జులై 8 వైపు కు మారింది.

. సైకొ సైయాన్ అని స్టార్ట‌య్యే ఈ సాంగ్ పూర్తి లిరిక‌ల్ విడీయో రిలీజ్ చేస్తామ‌ని తెలియ‌జేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌ల కి సిద్ధ‌మౌతోంది.

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus