సాహో ఫస్ట్ లుక్ పై భిన్న స్పందన!

“బాహుబలి”తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నేడు (అక్టోబర్ 23) ఆయన నటిస్తున్న తాజా చిత్రం “సాహో” ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పొగమంచులో నుండి నడుచుకుంటూ వస్తున్న ప్రభాస్ లుక్ హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉంది. ఇక బ్యాగ్రౌండ్ లో యూరప్ కంట్రీని చేర్చడం, ప్రభాస్ మొహం సగం మాత్రమే కనిపిస్తూ మిగతాది కనిపించకుండా లెదర్ జాకెట్ తో కవర్ చేసిన స్టిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ గా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ అభిమానులైతే తమ కథానాయకుడు హాలీవుడ్ హీరోలా ఉన్నాడని మురిసిపోతున్నారు.

కట్ చేస్తే.. నాణానికి రెండో వైపు కూడా ఉంటుందిగా, అలాగే ఈ పోస్టర్ కు నెగిటివ్ సైడ్ కూడా ఉంది. “సాహో” ఫస్ట్ లుక్ పోస్టర్ అచ్చుగుద్దినట్లు గత నెల విడుదలైన హాలీవుడ్ చిత్రం “బ్లేడ్ రన్నర్ 2049” ఫస్ట్ పోస్టర్ లా ఉంది. బ్యాగ్రౌండ్ మొదలుకొని, కలర్ గ్రేడింగ్, హీరో లుక్ అన్నీ సేమ్ టు సేమ్ దిగిపోయాయి. పోనీ ఇన్స్పిరేషన్ అని లైట్ తీసుకొందామా అనుకొంటే.. టైటిల్ లోగో కూడా సేమ్ టు సేమ్ ఉండడంతో కొందరు మాత్రం “కాపీ పోస్టర్” అంటూ గాలి తీసేస్తున్నారు. ఎవరి వాదన ఏదైనా విపరీతంగా హాలీవుడ్ సినిమాలు చూసేవారికి తప్ప సగటు తెలుగు సినిమా అభిమానులందరికీ ఈ ఫస్ట్ లుక్ అదుర్సే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus