నటి పూజిత పొన్నాడ నాలుగేళ్ల క్రితం వెండితెరకి పరిచయమైంది. కానీ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ‘తుంటరి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘రంగస్థలం’ సినిమాలో ఆదిపినిశెట్టి ప్రియురాలిగా నటించి కాస్త గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘మిస్ ఇండియా’ సినిమాలో కూడా పూజిత కనిపించింది. ఈమెకి స్టార్ డమ్ రానప్పటికీ సంపాదన మాత్రం బాగానే ఉన్నట్లుంది.
తాజాగా ఈమె కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. తన తల్లితండ్రులతో కలిసి గృహప్రవేశం కూడా చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. వాటిలో చీర కట్టుకొని ఎంతో సంప్రదాయకంగా కనిపిస్తోంది పూజిత. ఈ ఫోటోలు చూసిన ఫాలోవర్లు ఎంతో అందంగా ఉన్నావంటూ కామెంట్లు పూజితపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పూజిత పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదని ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పింది. ప్రస్తుతం పూజిత ఓ వైపు సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారిపోయింది.