Dhamaka: జగన్ కి పంచ్ ఇచ్చిన ‘జబర్దస్త్’ కమెడియన్!

సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్ పెట్టడం, ప్రభుత్వం లేదా పార్టీల మీద పంచులు వేయడం చాలా కామన్. ఇప్పటికి చాలా సార్లు అలా జరిగింది. ఏదైనా పార్టీతో సంబంధం ఉన్న వాళ్లు సినిమా తీస్తే.. అవతలి పార్టీకి పంచులు విసురుతుంటారు. అయితే ఒక్కోసారి రాజకీయ సంబంధం లేని హీరోల సినిమాల్లో కూడా అనుకోకుండా కొన్ని సార్లు పొలిటికల్ పంచ్ లు చూస్తుంటాం. రీసెంట్ గా విడుదలైన ‘ధమాకా’ సినిమాలో ఏపీ సర్కారుకి స్ట్రాంగ్ గా తగిలేలా ఒక పంచ్ పడింది. కాకపోతే ఆ పంచ్ వేసింది హీరో రవితేజ కాదు.. కమెడియన్ హైపర్ ఆది. సినిమాలో రావు రమేష్ దగ్గర డ్రైవర్ గా పని చేస్తుంటాడు ఆది.

పేరుకి డ్రైవర్ అయినప్పటికీ.. తన ఓనర్ మీద పంచ్ లు వేస్తుంటాడు. ఆ డ్రైవర్ వచ్చాక తనకు కలిసొచ్చిందనే కారణంతో అతడు ఏమన్నా.. పడుతుంటాడు రావు రమేష్. సినిమాలో ఒక సన్నివేశంలో రావు రమేష్.. రవితేజను చంపించడానికి రౌడీలను పెడతాడు. పదే పదే వాళ్లకు ఫోన్ చేసి వాడిని వేశారా..? లేదా..? అని అడుగుతుంటాడు. దానికి ఆది.. ‘బాబోయ్ అప్పట్నుంచి వేశారా లేదా వేశారా లేదా అంటున్నారు. ఒకటో తారీఖు వచ్చింది నా శాలరీ వేశారా లేదా..?’ అంటూ పంచ్ వేస్తాడు.

కావాలనే ఈ డైలాగ్ రాశారా..? లేక ఫ్లోలో రాసుకున్నారో తెలియదు కానీ.. ఈ పంచ్ జగన్ సర్కారుకి తగిలేలా ఉంది. ఏపీలో ఉద్యోగులకు టైంకి జీతాలు పడడం లేదు. నెల మధ్యలోకి వచ్చినా.. జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకి ఈ పరిస్థితి దిగజారుతుండడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సినిమాలో ఆ డైలాగ్ జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. సినిమాలో రవితేజ నెపోటిజంపై ఒక డైలాగ్ వేశారు. నా వెనుక ఎవరున్నారో తెలుసా అని విలన్ అంటే.. ‘నేను వెనుక ఎవరో ఉంటే పైకి వచ్చిన వాడిని కాదు. వెనుక ఎవరూ లేకపోయినా పైకి రావచ్చని నిరూపించిన వాడిని’ అంటూ డైలాగ్ కొడతారు. ఇది టాలీవుడ్ హీరోలపై వేసిన డైలాగ్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus