ఆ హిట్టు సినిమాలో నటించే ఛాన్స్ వస్తే పునీత్ మిస్ చేసుకున్నాడట..!

కన్నడ పవర్ స్టార్ గా పేరొందిన పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ వార్త దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. జిమ్ చేస్తుండగా ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు, అసిస్టెంట్లు హాస్పిటల్ కు తరలించగా డాక్టర్లు ఎంత ప్రయత్నించినా పునీత్ ను కాపాడుకోలేకపోయారు. 46 ఏళ్ళకే పునీత్ మరణించడం అందరినీ శోకసంద్రంలోకి తోసేసింది. పునీత్ కు గుండెపోటు రావడం అది మొదటి సారి అంతకు ముందు కూడా వచ్చిన సందర్భం ఉంది.

కానీ మితిమీరిన వర్కౌట్లు చేయడం వల్ల పునీత్ కు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అతని ఫ్యామిలీ డాక్టర్ చెప్పడం జరిగింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. పునీత్ రాజ్ కుమార్ తెలుగులో ఓ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే.. చేస్తానని చెప్పి చేయలేకపోయాడట. అది కూడా హిట్ సినిమానే..! వివరాల్లోకి వెళితే.. పునీత్ రాజ్ కుమార్ ను హీరోగా పరిచయం చేసింది మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్న సంగతి తెలిసిందే. ‘అప్పు’ అనే చిత్రంతో పునీత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. అదే చిత్రాన్ని తెలుగులో రవితేజతో ‘ఇడియట్’ గా రీమేక్ చేశాడు పూరి. అయితే ‘అప్పు’ నుండి పునీత్ కు పూరితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలో పునీత్ ను తెలుగు సినిమాల్లోకి తీసుకురావాలని పూరి చాలా ప్రయత్నించాడట. ఓ సినిమాలో నటించడానికి పునీత్ ఒప్పుకున్నాడు కూడా..! కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించలేకపోయాడు.

అది ఏ సినిమా అంటే.. ‘గోలీమార్’. గోపీచంద్ హీరోగా నటించిన ఈ మూవీ డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఈ మూవీలో చివరి సీన్లో ప్రకాష్ రాజ్ అలా వచ్చి ఫోన్లో హీరోతో నాలుగు డైలాగులు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ పాత్రని మొదట పునీత్ రాజ్ కుమార్ తో చేయించాలని పూరి అనుకున్నాడట. అందుకు పునీత్ ఓకే చెప్పడం కూడా జరిగింది. కానీ పునీత్ సినిమాల షెడ్యూల్స్ తారుమారు అవ్వడంతో.. ఈ పాత్ర చేయలేకపోయాడట పునీత్.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus