పునీత్ చివరి కోరికను తీర్చిన భార్య… ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ ట్వీట్!

కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన మరణించడానికి కొన్ని రోజులు ముందుగానే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గందన గుడి సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా ద్వారా కర్ణాటక అడవుల అందాలను ప్రతి ఒక్క కన్నడ ప్రేక్షకుడు చూడాలని పునీత్ ఎంతో ఆరాటపడినట్లు తాజాగా ఆయన సతీమణి అశ్విని పునీత్ వెల్లడించారు.

అమోఘవర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పునీత్‌ భార్య అశ్వినీ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా పునీత్ రాజ్ కుమార్ ఆఖరి చిత్రం. ఈ సినిమాలో ఆయన నటించడమే కాకుండా ఈ సినిమా ద్వారా కర్ణాటకలో ఉన్నటువంటి దట్టమైన అడవులు ప్రకృతి అందాలను ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చేరాలన్న ఉద్దేశంతోనే అప్పు ఈ సినిమాలో నటించారని ఈమె తెలిపారు. ముఖ్యంగా మనం ఈ అడవులను కాపాడుకొని రాబోయే తరం వారికి ఈ అందాలను అందిద్దాం

అనే ఉద్దేశంతో ఆయన ఈ వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీలో నటించారని అశ్విని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాని ప్రతి ఒక్క కన్నడ ప్రేక్షకుడి ముందుకు తీసుకువచ్చి పునీత్ రాజ్ కుమార్ చివరి కోరికను అశ్విని నెరవేర్చారు. అయితే ఈ సినిమా ప్రతి ఒక్క కన్నడ ప్రేక్షకుడు, ముఖ్యంగా పిల్లలు చూడాలన్నదే పునీత్ కోరిక. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమాని చూసి పునీత్ చివరి కోరికను నెరవేర్చండి

అంటూ ఈమె ట్విట్టర్ వేదికగా తన భర్త చివరి కోరికను తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈమె చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా పునీత్ మొదటి వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 28వ తేదీ విడుదలై ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus