మాటల తూటాలు పేల్చనున్న పవన్, బాలయ్య
- April 19, 2017 / 12:35 PM ISTByFilmy Focus
దర్శకత్వంతో పాటు సొంతంగా మాటలను రాసుకునే ప్రతిభగల నేటి తెలుగు డైరక్టర్లు పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒకరు సూటిగా సుత్తిలేకుండా డైలాగులు పేలిస్తే.. మరొకరు సున్నితంగా పంచ్ లు వేస్తారు. వారు సినిమాలంటే డైలాగ్స్ కోసమే వెళ్లే వారు చాలామందే ఉన్నారు. అటువంటి పేరున్న వీరిద్దరూ ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 25 వ సినిమాని త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తుండగా, బాలయ్య 101 చిత్రాన్ని పూరి తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. బాలయ్య మూవీ సెప్టెంబర్ 28 రిలీజ్ అవుతుందని మొదట్లోనే స్పష్టం చేశారు.
పవన్ సినిమా కూడా ఇంచుమించు వారం తేడాలో విడుదలవవుతుంది. సో అప్పటికి వేసవి పోయి వానాకాలం మొదలయి ఉంటుంది. కానీ థియేటర్లలో బాలయ్య, పవన్ డైలాగుల వేడి మొదలవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే పూరి, త్రివిక్రమ్ కలాల నుంచి వచ్చిన డైలాగులను స్టార్ హీరోలు చెబుతుంటే థియేటర్లు చప్పట్లతో నిండిపోతుందని భావిస్తున్నారు. బాలకృష్ణ గ్యాంగ్ స్టర్ గా డైలాగులతో అదరగొడితే.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పవన్ పంచ్ లతో విందు ఇవ్వనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















