ఎన్టీఆర్ సినిమా పట్ల అసహనంతో పూరీ…
- July 10, 2017 / 05:54 AM ISTByFilmy Focus
పూరీ జగన్నాధ్…సినిమాకి కమర్షియల్ టచ్ ఇచ్చి సినిమా రేంజ్ ని…హీరోని ఎక్కడికో తీసుకెళ్లే దర్శకుల్లో పూరీ జగన్నాధ్ కి మంచి పట్టు ఉంది…స్క్రీన్‌ప్లే విషయంలో కూడా పూరీ మంచి రైటర్. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఎన్నో హిట్స్, బ్లాక్ బాస్టర్స్ అందించిన పూరీ…అదే క్రమంలో డిజాస్టెర్స్ ను సైతం చవి చూసాడు…ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ జై లవకుశ సినిమా టీజర్ చూసి షాక్ అయ్యి…హర్ట్ అయ్యాడని టాక్…అసలు మ్యాటర్ ఏంటి అంటే…యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న జై లవకుశ టీజర్ సంచలనాలు అందరికి తెలిసిందే. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో జై పాత్ర తారక్ అదరగొట్టాడు. సినిమాలో విలన్ గా ఒక పాత్రలో కనిపించబోతున్న తారక్ యాటిట్యూడ్ రేపు దుమ్ము దులిపేస్తుంది అని చెప్పక తప్పదు. అయితే ఈ సినిమా టీజర్ చూసి అందరు హ్యాపీగా తారక్ ను పొగుడుతుంటే పూరి మాత్రం కాస్త డిసప్పాయింట్ లో ఉన్నాడని తెలుస్తుంది. దానికి అసలు కారణం ఈసీనిమాలో ఎన్టీఆర్ చేస్తున్న విలన్ పాత్ర…కాస్త క్లుప్తంగా ఆలోచిస్తే…ఓ ఇంగ్లిష్ పేపర్ ప్రచురించిన కథనం ప్రకారం ‘జై’ లో తారక్ ఏదైతే క్యారక్టర్ లో కనిపించాడో అదే పాత్రతో తాను ఓ కథ రాసుకున్నాడట.
అందుకే తారక్ జై పట్ల పూరి తీవ్రంగా హర్ట్ అయ్యాడని అంటున్నారు. ఈ విషయం ప్రముఖ ఆంగ్ల పత్రిక బట్టబయలు చేయడంతో అందరు షాక్ అయ్యారు. టెంపర్ తర్వాత పూరి తారక్ కు ఓ కథ వినిపించాడట ఆ కథలో తాను ఎలాంటి పాత్ర రాసుకున్నాడో అదే క్యారక్టరైజేషన్ లో జై ఎన్.టి.ఆర్ కనిపించేసరికి షాక్ అయ్యాడట పూరి. తన కథ క్యారక్టరైజేషన్ వాడుకున్నాడని పూరి కాస్త అసహనంలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా దర్శకుడు ఒక లైన్ అనుకోవడం ఈలోపు ఎవరో ఒకరు ఆ టైప్ సినిమాను తెరకెక్కించడం సహజమే అన్నది అందరికీ తెలిసిన విషయమే…మరి దీనిపై జైలవకుశ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















