Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కొత్త సంవత్సర వేళ పూరి మ్యూజింగ్స్‌ వావ్‌

కొత్త సంవత్సర వేళ పూరి మ్యూజింగ్స్‌ వావ్‌

  • January 1, 2021 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త సంవత్సర వేళ పూరి మ్యూజింగ్స్‌ వావ్‌

మన గురించి, సమాజం గురించి, మన ఆలోచనల గురించి పూరికి తెలిసినట్లు ఇంకా ఎవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో. తన మ్యూజింగ్స్‌ వింటుంటే మనం ఇలానే చేస్తున్నాం, ఓహో ఇలా చేయడం కరెక్ట్‌ కాదా అనే ప్రశ్నలు మొదలవుతాయి. ఒక్కోసారి గట్టిగా కొట్టినట్లు చెబుతాడు కానీ, అది కచ్చితంగా నూటికి నూరు శాతం కరెక్టే ఉంటుంది. తాజాగా 2020 గురించి తన మ్యూజింగ్స్‌లో చెప్పుకొచ్చాడు పూరి. అసలు 2020 మనకు గురువు అని అంటున్నారు పూరి. 2020 నుంచి ఏమేం నేర్చుకోవాలో చెప్పాడు, పనిలో పనిగా 2021లో ఏం చేద్దామనేదీ చెప్పాడు. ఓసారి చదివేయండి, వీలైతే ఫాలో అయిపోండి.

‘‘ఏమైందని అందరూ 2020ని తిడుతున్నారు. మన జీవితంలో గత ఏడాదెంతో ఉత్తమమైంది. 2020 మనకు చాలా విషయాలు నేర్పింది. ఆరోగ్యం ఎంత ముఖ్యమో చెప్పింది. రోగనిరోధక అవసరాన్ని చూపించింది. పోషకాహారం విలువ తెలిసేలా చేసింది. పరిశుభ్రత ఆవశ్యకత గురించి నేర్చుకున్నాం. నాకు తెలిసి పుట్టిన తర్వాత ఎప్పుడూ మనం ఇన్నిసార్లు చేతులు కడుక్కొని ఉండం. గ్రామాల్లో పుట్టిన వాళ్లకూ చాలా విషయాలు తెలిశాయి. వైరస్‌, శానిటైజర్‌, క్వారైంటన్‌, యాంటీ బాడీస్‌, ప్లాస్మా, స్ట్రెయిన్‌ ఇలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం. లాక్‌ డౌన్‌ పెట్టాక… మొదట్లో నెలరోజులు పిచ్చిపట్టినట్లయింది. ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే మానసిక ఆరోగ్యం చాలా అవసరమని తెలుసుకున్నాం. అంతేకాదు మనలో ఓపిక పెరిగింది. ఎనిమిది నెలలు ఎలా గడిచిపోయాయో మనకే తెలియలేదు. డబ్బు ఉన్నా లేకపోయినా.. ఎలా బతికాం అన్నది మనకే తెలియలేదు. నిజమైన స్నేహితులు ఎవరో ఇప్పుడే తెలిసింది. జీవితంలో సేవింగ్స్‌ అవసరం తెలిసొచ్చింది. వర్క్‌ ఫ్రమ్ హోం గురించి నేర్చుకున్నాం. ఆడవాళ్లు బంగారం, కొత్త చీరలు లేకుండా బతకడం నేర్చుకున్నారు. అవసరమైనవి మాత్రమే కొనుక్కోవడం నేర్చుకున్నాం. అనవసరమైన షాపింగ్‌లు, చిరుతిళ్లు బాగా తగ్గాయి. ప్రకృతి చాలా శక్తిమంతమైనదని తెలిసింది. ఏ దేవుడూ మనల్ని కాపాడలేడని తెలిసింది. ఎవరైనా సాయం చేస్తే దాని విలువ మనకు అర్థమైంది’’ అని పూరి చెప్పారు.

‘‘రెండు నిమిషాలు ఊపిరి ఆగిపోతే ప్రాణాలు పోతాయి. ఇప్పుడు చావనేది పెద్ద విషయం కాదు’ అనేది తెలిసొచ్చింది. అనుక్షణం ఒళ్లు దగ్గర పెట్టుకొని జీవించాం. జలుబు, జ్వరాన్ని కూడా మనం భరించలేని పరిస్థితి వచ్చింది. పసుపు, వెల్లుల్లి, తేనె, కషాయం, ఆవిరి పట్టడం వంటి ఇంటి చిట్కాలు, వస్తువులు ఎంత మంచివో తెలిసింది. ఆయుర్వేదం విలువ తెలిసింది. 2020 మహమ్మారి సంవత్సరం కాదు.. మేల్కొలుపు సంవత్సరం. అందుకే గతేడాదిని మనం గౌరవించాలి. గత ఏడాది మనకు గురువు. దేశంలో ఉత్పాదకత నాశనమైపోయింది. ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. పోతే పోనీ బతికున్నాం చాలురా దేవుడా అనే పరిస్థితి వచ్చింది. 2021 ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. ఇంకా ఎన్ని వైరస్‌లు వస్తాయో తెలియదు. కానీ, 2020 అనుభవం తర్వాత మనం చాలా పరిపక్వత సాధించాం. మనలో ఏదో తెలియని విశ్వాసం వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు పూరి.

‘‘జీవితంలో ప్రతి రోజునూ పండగలా జరుపుకోవడం నేర్చుకోండి. గతం మనది కాదు.. భవిష్యత్తు మాత్రమే మనది కాదు.. ఈ రోజును మనం ఆస్వాదించామా.. లేదా..! అనేది తెలుసుకోండి. సెలబ్రేషన్‌ అంటే ఏంటి? పని చేయడం, నవ్వడం, ప్రేమించడం, పాడటం, డ్యాన్స్‌ చేయడం. అందరూ జీవితాన్ని సెలబ్రేట్‌ చేసే పనిలో ఉంటే ప్రపంచంలో సగం దరిద్రాలు తగ్గిపోతాయి. గొడవలుండవు, యుద్ధాలుండవు. ఉదయం లేవగానే, హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నామా లేదా, మన మూత్రం రంగు మారిందా లేదా అనేవే మనం చేయాల్సి పనులు. ఈ రెండూ బాగుంటే ఆ రోజు మనం బాగున్నట్లే. రోజూ పని చేసుకుందాం. ఇక నుంచి డబుల్ కష్టపడదాం. మంచి ఆహారం తిందాం. రోజుకు అరగంటైనా వ్యాయామం చేద్దాం. కుదరకపోతే కనీసం పది గుంజీలు, కాసేపు గోడకుర్చీ వేద్దాం. కరెంట్‌, నీళ్లు, ఆహారం వృథా చేయొద్దు. జంతువుల్లా రోజంతా ప్రశాంతంగా ఉండటం నేర్చుకుందాం. మొక్కలు, ఆకులు, చెట్లను పలకరిద్దాం. స్నేహితులతో కలిసి కాసేపు నవ్వుకుందాం. బతికిన ప్రతి రోజూ ఇలా సెలబ్రేట్‌ చేసుకుంటూ పోవడమే.. ప్రతి రోజూ పండగ చేసుకుంటూ ఆస్వాదిద్దాం’’ అని పూరి తాజా మ్యూజింగ్స్‌లో చెప్పుకొచ్చాడు. పూరి సినిమాలో చెప్పినవి చేస్తుంటారు, ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. ఇవి కూడా ఓసారి ట్రై చేయండి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movies
  • #music
  • #Shootings
  • #Songs

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

24 mins ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

3 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

5 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

22 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

23 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

24 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version