పూరి ఇటీవల ఫిలాసఫీలు చెబుతూ వరుసగా ‘పూరి మ్యూజింగ్స్’ పేరిట పాడ్ క్యాస్ట్ లో పలు ఆడియో లను విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ టైం నుండీ పూరి ఆడియో ఫైల్స్ ను విడుదల చేస్తూ వస్తున్నాడు. తాజాగా హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోకూడదు అంటూ పూరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. పూరి మాటల్లో..”సినిమా హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోకూడదు. ఎందుకో నాకు అది నచ్చదు. కోటిమందిలో ఒకరికి నటి అయ్యే అవకాశం లభిస్తుంది. అందుకే వాళ్లు చాలా స్పెషల్. అందరిలాగే వాళ్ళు కూడా పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కంటే నాకు నచ్చదు.
హీరోయిన్స్‌ని.. వాళ్ళ అభిమానులు దేవతల్లా భావిస్తుంటారు. అలాంటి దేవతలు పురిటి నొప్పులు పడుతుంటే చూడడానికి కష్టంగా ఉంటుంది.నిజ జీవితంలో మనం పూజించే దేవతలు కూడా పిల్లల్ని కనలేదు. ఆ కోరిక మనుషులకు ఉంటుంది. దేవతలకు కాదు. కాబట్టి.. హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోకుండా దేవతల్లా ఉంటేనే మనం ఇష్టపడతాం. మామూలు అమ్మాయిలకంటే కూడా మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. కాబట్టి మీరైనా మగాణ్ణి దూరం పెట్టొచ్చు కదా..! ప్రేమ లేకపోతే చచ్చిపోతారా? జయలలిత, మాయావతి, మమతాబెనర్జీ.. ఇలా చాలామంది ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి మీరు.
వాళ్లకు మగవాళ్లతో పనిలేదు. పురాణాల్లో కూడా సింగిల్ ఉమెన్స్ గా చాలా మంది ఉన్నారు. ఇక, హాలీవుడ్‌లో అయితే పెళ్లిని పక్కనపెట్టిన లేడీ సూపర్‌స్టార్స్ లిస్ట్ చాలా ఎక్కువ. రంభ ఊర్వశి, మేనకలు పెళ్లిళ్లు చేసుకోలేదు కాబట్టే స్వర్గం పై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.కాబట్టి హీరోయిన్స్.. మీరు నా మాట విని దేవతల్లా ఆలోచించండి. మీ శక్తిని మరో విధంగా ఉపయోగించండి. ‘రైజింగ్ ట్రైబ్ ఆఫ్ సింగిల్ ఉమెన్’ అనే నినాదంతో ఇండియాలో ఓ ఉద్యమం మొదలవుతుంది.కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు గట్స్ ఉన్న ప్రతి మహిళా దేవతలా మారాలి. మంగళసూత్రం మర్చిపోండి. నేను స్ట్రాంగ్ ఉమెన్ అని మీరు ఫీలైతే జీవితంలో సింగిల్‌గా ఉండిపోండి. స్ట్రాంగ్ ఉమెన్ మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరు’ అంటూ చెప్పుకొచ్చాడు.
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?