పూరీ చాలా గట్స్ తో వస్తున్నాడు…
- March 25, 2017 / 05:47 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో పూరీ జగన్నాధ్ దర్శకత్వం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ఆయన టేకింగ్….డైలాగ్స్…స్క్రీన్‌ప్లే సూపర్ అనే చెప్పాలి….అయితే అదే క్రమంలో….హిట్స్ రేషియోలో మాత్రం పూరీ కాస్త వెనుకబడి ఉన్నాడు అనేది ఒప్పుకోక తప్పని నిజం…ఇదిలా ఉంటే అప్పట్లో…పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ ల మధ్య ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే….ఇక ఆ తరువాత వారిద్దరి మధ్య దూరం పెరిగింది అన్న వార్తలు గుప్పుమన్నాయి… ఒకటి రెండు సందర్భాలలో పూరి పవన్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన సందర్భాలు కూడ మనం చూశాం…. అయితే ఆ తరువాత అంతా సర్దుకుంది అని వాతావరణం చూస్తే అర్ధం అవుతుంది…. అయితే ఆ విషయం పక్కన పెడితే…పూరీ ఈ పరిస్థుతులలో పెద్ద సాహసమే చేస్తున్నాడు….విషయంలోకి వెళితే…పవన్ ‘కాటమరాయుడు’ మూవీని లెక్క చేయకుండా పూరిజగన్నాథ్ ఒక కొత్త హీరోతో తీసిన ‘రోగ్’ సినిమాను ఉగాది రోజున విడుదల చేయబోతు ఉండటం అందరికీ షాక్ ఇస్తోంది.
సునామీలా దూసుకు వచ్చిన ‘కాటమరాయుడు’ సినిమాకు ఈమూవీ రిలీజ్ అయిన తరువాత రెండు వారాల వరకు పెద్దగా ఏపోటీ ఉండదని అందరు భావించారు. అయితే అనూహ్యంగా మార్చి 31న విడుదల కావాల్సిన పూరి జగన్నాథ్ ‘రోగ్’ని రెండు రోజులు ముందుకి జరిపి ‘ఉగాది’ కే రిలీజ్ చేస్తున్నారు. అయితే దానికి ప్రత్యేక కారణం లేకపోలేదు….ఏప్రియల్ మొదటి వారంలో విడుదలవుతుందని అనుకున్న వెంకటేష్ ‘గురు’ ని కూడా మార్చి 31కి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో బడా హీరో తాకిడికి దూరంగా తన సినిమాను ముందుకు జరుపుతున్నాం అని అనుకుంటున్నాడే కానీ…సునామీకి ఎదురు వెళ్తున్నా అని ఆలోచించడం లేదు పాపం పూరీ….
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












