టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న వారే అని చెప్పాలి. అయితే గత ఏడాది లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన భారీ డిజాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి (Puri Jagannadh) పూరి జగన్నాథ్ సినిమాలలోకి రాకముందు తాను ఏం చేసేవారు అనే విషయాలను కూడా తెలియజేశారు. తాను సినిమాలలోకి రాకముందు ఎన్నో కథలను సిద్ధం చేసి దర్శకులకు ఇచ్చేవాడిని తెలిపారు. అలా కథ ఆధారంగా తనకు వంద రూపాయల నుంచి వేయి రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చే వారని ఈయన తెలియజేశారు. ఇలా తాను కొన్ని కథలు రాయడమే కాకుండా చిన్న చిన్న సీన్ లకి డైరెక్షన్ కూడా చేస్తూ అలా డైరెక్షన్ వైపు వచ్చానని తెలియజేశారు.
ఇలా సినిమాలకు కథలు అందిస్తూ ఎన్నో మంచి సక్సెస్ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారని తెలిపారు. అయితే ఆ సక్సెస్ మొత్తం ఆదర్శకుల ఖాతాలోకి వెళ్లిపోయదని పూరి జగన్నాథ తెలిపారు. ఇలా తాను సినిమాలకు కథలు అందించడమే కాకుండా ప్రముఖ మ్యాగ్జిన్ ప్రింట్ చేసే యానిమేటెడ్ షార్ట్ స్టోరీకి బొమ్మలు కూడా గీసి ఇచ్చేవారట. ఈ విధంగా వారు కథ చెబితే అందుకు అనుగుణంగా బొమ్మలు గీసి ఇవ్వడంతో తనకు వారానికి 50 రూపాయలు ఇచ్చేవారని తెలిపారు.
అప్పట్లో ఈయన 100,50 రూపాయలకు భారీగానే తన టాలెంట్ మొత్తం బయట పెడితే తనని తాను నిరూపించుకున్నారని తెలుస్తుంది.ఇలా వారానికి 50 రూపాయలు సంపాదించే పూరి జగన్నాథ్ ఇప్పుడు మాత్రం స్టార్ డైరెక్టర్ గా ఒక్కో సినిమాకు కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా నిర్మాతగా మారి భారీ బడ్జెట్ సినిమాలను కూడా చేస్తున్నారని చెప్పాలి.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్