అయ్యో… పూరి ఇలా ఇరుక్కున్నాడేంటి?

ఈమధ్యే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. 4 ఏళ్ళ తర్వాత ఓ హిట్టందుకున్నాడు పూరి. హీరో రామ్ ను తెలంగాణ కుర్రాడిగా ఊర మాస్ గా చూపించి ప్రేక్షకులకి పూనకాలు తెప్పించాడు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్ అని చెప్పాలి. ఇక హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్ గ్లామర్ కూడా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా మిగిలాయి. చాలా రోజులు తరువాత దొరికిన హిట్ కాబట్టి పూరి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇదే జోష్ లో విజయ్ దేవరకొండతో తన తరువాత సినిమా చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు.

ఇదిలా ఉండగా… ఎంతో సంతోషంగా ఉన్న పూరి…ఈరోజు తన పెళ్ళిరోజు కూడా కావడంతో తన భార్య లావణ్యను ఒడిలో కూర్చోపెట్టుకుని ఉన్న ఓ ఫోటోని తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో చూసిన నెటిజన్లు ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ‘పూరీని ట్రోల్ చేసేంత తప్పు ఇందులో ఏముంది అని అనుకుంటున్నారా’..! అసలు విషయం ఏంటంటే.. ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ… ‘పండు ఐ లవ్ యు’ అని క్యాప్షన్ పెట్టాడు. తన భార్యను ముద్దుగా పండు అని పిలుస్తానని ‘బిజినెస్ మేన్’ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో పూరి తెలిపిన సంగతి తెలిసిందే. అందుకే అలా క్యాప్షన్ పెట్టి తన కూతురు పవిత్ర. అలాగే కొడుకు ఆకాష్ పూరి ని ట్యాగ్ చేసాడు.. అయితే పొరపాటున తన భార్య లావణ్య ను ట్యాగ్ చేయబోయి… హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ట్యాగ్ చేశాడు. అంతే దేనిని పట్టుకుని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫోటో పోస్ట్ చేసింది పూరి కూతురు పవిత్ర అట. ఆమెకు తెలీక హీరోయిన్ లావణ్యను ట్యాగ్ చేసేసింది తెలుస్తుంది. పూరి ఇన్స్టా ఖాతాను ఆమెనే మెయిన్టైన్ చేస్తుందట. పాపం ఆమె చేసిన తప్పుకి పూరిని ట్రోల్ చేస్తున్నారు.

1

2

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus