Puri Jagannadh: హాట్ టాపిక్ గా మారిన పూరీ జగన్నాథ్ లేటెస్ట్ పిక్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో పూరీ జగన్నాథ్ కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే.. జయాపజయాలతో సంబంధం లేకుండా పూరీ.. దూకుడుగా సినిమాలు చేస్తుంటారు. ఆయన ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇస్తారు అనే కాన్ఫిడెన్స్ అభిమానులతో పాటు నిర్మాతలకు కూడా ఉంది. పైగా పూరీ తక్కువ బడ్జెట్లో చాలా ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేయడంలో దిట్ట. ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అయినా పూరీ క్రేజ్ ఏమీ తగ్గలేదు.

ప్రస్తుతం అతను రామ్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..తాజాగా ఛార్మీ.. పూరీ జగన్నాథ్ కి సంబంధించిన లేటెస్ట్ పిక్ ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఆ ఫోటోకి ‘సూర్యుడు ఉదయించినప్పుడు’ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే ఈ ఫోటో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఎందుకంటే ఈ ఫొటోలో పూరీ లుక్‌ చాలా డిఫెరెంట్ గా ఉంది.

అసలు ఈ ఫోటోలో ఉన్నది పూరియేనా? అనేంతలా ఉంది (Puri Jagannadh) అతని లుక్. ఎందుకో అతని మోహంలో చాలా తేడా వచ్చింది.అనారోగ్యం పాలైతే మోహంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అలా ఉంది పూరీ లుక్. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే పూరీ టీంని అడిగితే.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.. ప్రస్తుతం వెకేషన్లో ఉన్నారు అంటూ చెబుతున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus