‘ఇస్మార్ట్ శంకర్’ చూసాక మీకే తేడా తెలుస్తుంది?

అప్పట్లో పూరి జగన్నాథ్ తో సినిమా అంటే.. స్టార్ హీరో దగ్గర్నుండీ కుర్ర హీరో వరకూ ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నా ముందుండే వారు. ఎందుకంటే.. పూరి త్వరగా సినిమాని పూర్తి చేయడంతో పాటు.. మినిమం గ్యారంటీ డైరెక్టర్ గా రాణించేవాడు. అంతేకాదు సినిమాలో కథ లేకపోయినా హీరో క్యారెక్టరైజేషన్.. అలా మాస్ డైలాగులతో థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించేవాడు. దీంతో ఆ హీరోకి మాస్ ముద్ర మరింత బలపడేది. ఒకవేళ సినిమా అటు ఇటూ అయినా.. ఆ హీరో కి తరవాతి సినిమా మాత్రం పెద్ద హిట్టవుతూ వచ్చింది. అలాంటి డైరెక్టర్ పూరి పరిస్థితి ఇప్పుడు మరీ ఘోరంగా తయారయ్యింది. కనీసం మీడియం హీరోల కాల్షీట్లు దొరకడం కష్టమైపోయింది.

ఇలాంటి టైంలో రామ్ అవకాశం ఇచ్చాడు. రామ్ తో తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం జూలై 18 న(రేపు) విడుదల కానుంది. ఈ చిత్రంతో ఖచ్చితంగా హిట్టు కొడతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు పూరి. ఇక విడుదలైన ట్రైలర్స్ లో కూడా రామ్ ఎనర్జీ ఓ రేంజ్లో ఉంది కాబట్టి.. ప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు. అందుకే బుకింగ్స్ అదిరిపోయాయి. రామ్ కెరీర్లో కచ్చితంగా బిగ్గెస్ట్ ‘డే 1’ సాధిస్తుంది అనడంలో సందేహం లేదు.

ఇక ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ పై కొన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇది హాలీవుడ్ మూవీకి కాపీ’ అంటూ కొందరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ‘ఈ కథ హాలీవుడ్ సినిమా స్పూర్తితో రాసుకున్నదే, కానీ కాపీ మాత్రం కాదు. ఇస్మార్ట్ శంకర్ విడుదల తరువాత మీరు ఈ రెండు చిత్రాలను పోల్చి చూసుకోండి, వ్యత్యాసం మీకే తెలుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus