Puri Jagannadh: వాళ్లే ప్రపంచంలో సమస్యలన్నింటికీ కారణమంటున్న పూరి!

‘‘నొమాడ్స్‌ ఎప్పుడైనా, ఎక్కడైనా గొడవ చేశారా? ధర్నా చేశారా? యుద్ధాలు చేశారా? సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారా? లేదు కదా. అసలు వాళ్లు ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. నా వరకు అయితే వాళ్లే అసలైన మనుషులు’’ అంటున్న పూరి జగన్నాథ్‌. పూరి మ్యూజింగ్స్‌ గతేడాది కరోనా సమయంలో పూరి జగన్నాథ్‌ ప్రపంచంలో వివిధ విషయాల గురించి వివరించేవారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. అందులో భాగంగా నోమాడ్స్‌ గురించి ఆయన ఇంకా ఏం చెప్పారంటే?

‘‘నొమాడిక్‌ అంటే సంచార జీవనం అని అర్థం. సంచార జీవనానికి ఒక మోడల్‌ అంటూ ఉండదు. అది జీవన విధానం అంతే. రష్యా, మంగోలియా వంటి దేశాల్లో ఎంతోమంది సంచార జీవనం సాగిస్తుంటారు. అవసరమైనప్పుడు వేటాడుకుంటూ.. ఆ తర్వాత వలసపోతూ ఉంటారు. కుక్కలు, గొర్రెలు, గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, ఆవులు పెంచుకుంటూ ఉంటారు. వివిధ జంతువుల చర్మాలతో దుస్తులు తయారు చేసుకుంటారు. నొమాడ్స్‌ అంటే ఏదో జాతిప్రజల గురించి చెబుతున్నాం అనుకోవద్దు. నేను చెబుతున్నది మన గురించే. నిజానికి మనందరం అలా వచ్చినవాళ్లమే. ఆ జాతికి చెందిన మనుషులమే. పది వేల సంవత్సరాల క్రితం వరకూ 99 శాతం మంది ఇలాంటివారే’’ అని పూరి చెప్పుకొచ్చారు.

‘‘ప్రజల్లో ఇప్పటికీ వలస జీవితాలు బతుకుతున్నవారు ఉన్నారు. వాళ్లకు భవిష్యత్తు గురించి ఆలోచనే ఉండదు. ఏ రోజు గురించి, ఆ రోజు ఆలోచించుకుని బతుకుతుంటారు. నిజానికి మనుషులు సంచార జీవితం గడిపిన రోజులు బాగుండేది. ఆ విధానం ఆగిన తర్వాతే కష్టాలు మొదలయ్యాయి. ప్రాంతాలు, దేశాలు, సరిహద్దులు, ఖండాలు, జాతులు, యుద్ధాలు, కథలు, చరిత్రలు, ఇతిహాసాలు, పక్షులు, జంతువుల్లా మనుషులు కూడా ఇప్పటికీ సంచార జీవనం గడుపుతుంటే బాగుండేది. ఏ గొడవ ఉండేది కాదు’’అ ని చెప్పుకొచ్చారు పూరి.

‘‘మీకు డిజిటల్‌ నోమాడ్స్‌ గురించి తెలుసా. వీళ్లు పట్టణాల్లో పుట్టి, చదువుకొని సంచార జీవనం గడుపుతుంటారు. వాళ్లు కూడా ఒకచోట ఉండరు. ప్రత్యేకంగా ఇల్లు ఉండదు. ప్రపంచమంతా తిరుగుతుంటారు. బతకడం కోసం ఆన్‌లైన్‌లో ఉద్యోగం చేస్తారు. బ్లాగ్స్‌ రాస్తుంటారు. ట్రావెల్‌ వీడియోలు తీస్తుంటారు. పుస్తకాలు అమ్ముతారు. ఇలా రకరకాల పనులు చేస్తూ సంచార జీవితం గడుపుతుంటారు. మన దేశంలోనూ ఇలాంటివాళ్లున్నారు. మొత్తంగా ప్రపంచంలో ఇలాంటివి 300 జాతులున్నాయి’’ అని చెప్పాడు పూరి.

‘‘ఇన్ని కోట్లమంది నొమాడ్స్‌ ఎప్పుడైనా, ఎక్కడైనా గొడవ చేశారా? ధర్నా చేశారా? యుద్ధాలు చేశారా? సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారా? లేదు కదా. అసలు వాళ్లు ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. నా వరకు అయితే వాళ్లే అసలైన మనుషులు. తెల్లవారిన దగ్గర్నుంచి మనలా జీవితం గురించి వాళ్లు ఎప్పుడూ ఫిర్యాదు చేయరు. ఇల్లు లేని వాళ్లు ఎప్పుడైనా మంచివాడు. సొంత ఇల్లు కట్టుకున్నవాళ్లు, కట్టుకోవాలని అనుకునేవాళ్లు, ఇప్పటికే పది ఇళ్లు కట్టుకున్నవాళ్లే ప్రపంచంలో ఉండే సమస్యలన్నింటికీ కారణం’’ అంటూ నోమాడ్స్‌ గురించి వివరించారు పూరి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus