ఈమధ్యకాలంలో సరైన విజయం లేక చతికిలపడిన మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మళ్ళీ ఒక మాస్ కమ్ బ్యాక్ కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. “మెహబూబా” అనంతరం మళ్ళీ తన కొడుకుతోనే ఆయన మరో సినిమా తీస్తాడని వార్తలొచ్చినప్పటికీ.. తాజా సమాచారం మేరకు ఆయన ఎనర్జీటిక్ స్టార్ రామ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నాడట. ఆల్రెడీ స్టోరీ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయి. త్వరలోనే లాంఛనంగా ప్రారంభోత్సవం కూడా జరగనుంది. ఇటీవల విడుదలైన “హలో గురు ప్రేమకోసమే” చిత్రంతో ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి సూపర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రామ్.
నిజానికి రామ్ కూడా “హలో గురు ప్రేమకోసమే” అనంతరం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి అనుకున్నాడు. కానీ.. బడ్జెట్ పరిమితుల కారణంగా ఆ ప్రొజెక్ట్ తప్పిపోవడంతో.. ఆ ప్లేస్ లో పూరీ జగన్నాధ్ సినిమాను పట్టాలెక్కించాడు. ప్రెజంట్ రామ్ & పూరీ జగన్నాధ్ లకు కావాల్సింది ఒక్కటే.. “ఒక సాలిడ్ హిట్”. మరి రామ్ & పూరీలు ఈ క్రేజీ కాంబినేషన్ లో హిట్ కొడతారా లేదా అనేది చూద్దాం.