ఇద్దరు హీరోలను లైన్లో పెట్టిన పూరి జగన్నాథ్

హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో పూరి జగన్నాథ్ స్టైలే వేరు. పూరి చేసే సినిమాల్లో కథాబలం కన్నా హీరో పాత్ర పాత్ర మీదే ఎక్కువ శ్రద్ధ పెడతాడన్న సంగతి తెలిసిందే. పూరి డైరెక్షన్లో ఒక్క సినిమా చేస్తే చాలు ఆ హీరోకి ఎనలేని క్రేజ్ వస్తుందని అని నమ్మేవారు అప్పట్లో..! మెగాస్టార్ చిరంజీవి కూడా రాంచరణ్ ను పూరి డైరెక్షన్లే లాంచ్ చేసారంటే పూరిపైన నమ్మకం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అయితే గత కొంత కాలంగా పరిస్థితి అంతా మారిపోయింది. గత 4 సంవత్సరాలలో జూ.ఎన్టీఆర్ తో చేసిన ‘టెంపర్’ తప్ప పూరికి ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా సాధించలేకపోయాడు. ఇప్పుడు పూరి కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి.

ఈ క్రమంలో ఇద్దరు యంగ్ హీరోలను పూరి లైన్లో పెట్టినట్టు సమాచారం. ఒకరు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాగా.., ఇంకొకరు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. తాజా సమాచారం ప్రకారం విజయ్ కు కథ చెప్పడానికి పూరి ప్రత్యేకంగా కాకినాడకు వెళ్ళి విజయ్ కు కథ వినిపించాడట. విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం కాకినాడలో జరుగుతుండడంతో పూరి కథ చెప్పటానికి కాకినాడ వెళ్ళినట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ ఈ మధ్యకాలంలో ఒక హీరో కి కథ వినిపించడానికి ఇంతలా ట్రై చేయడం ఇదే మొదటిసారంట. పూరి శిష్యుడు పరుశరామ్ తో విజయ్ చేసిన ‘గీత గోవిందం’ సూపర్ హిట్ అవ్వడంతో పూరి ఇలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తాడో.. లేదో తెలియాల్సి ఉంది. ఒక వేళ విజయ్ ఓకే చేయకపోతే రామ్ తో మరో ప్రాజెక్ట్ ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడంట పూరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus