Puri Jagannadh: పోకిరి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన పూరి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన దర్శకత్వంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేసే మంచి హిట్ సినిమాలను అందుకున్నారు. ఇలా దర్శకుడిగా అందరీ హీరోలకు ఈయన బ్లాక్ బస్టర్ సినిమాలను ఇచ్చారు. ఇలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పోకిరి.

ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసిన భారీ స్థాయిలోనే ఈ సినిమాకు ఆదరణ లభిస్తుందని చెప్పాలి. అంతగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. మహేష్ బాబు కెరీర్ లోనే ఇలాంటి మాస్ యాక్షన్ మూవీ ఇప్పటివరకు రాలేదు. తాజాగా పూరి జగన్నాథ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పోకిరి సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

పోకిరి సినిమా చేసేటప్పుడు అన్ని సినిమాల లాగే ఈ సినిమాని కూడా చేశామని తెలిపారు.అయితే ఈ సినిమా ఇలాంటి సక్సెస్ అందుకుంటుందని విడుదలకు ముందు మేము అసలు ఊహించలేదని ఈయన తెలియజేశారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అసలు ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అని నేను చాలా సార్లు ఆలోచించానని తెలిపారు.

ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి నేను ప్రసాద్ ల్యాబ్ లో మరోసారి ఈ సినిమా వేసుకొని చూసాను అయితే ఈ సినిమా ఎందుకు సక్సెస్ అయిందో తనకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటూ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక అన్ని సినిమాలు ఒకే దృష్టితో చేస్తామని అయితే ఏ సినిమా ఎలా ఆడుతుందనే విషయాలను ఎవరు చెప్పలేమనీ ఈ సందర్భంగా పూరి (Puri Jagannadh)  తెలియజేశారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus