సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ అయితే ఆ నష్టాల భారం ఆ సినిమాను నిర్మించిన వాళ్లపై ఊహించని స్థాయిలో పడుతుందనే సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లైగర్ మూవీ ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది. 90 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం 25 కోట్ల రూపాయల కలెక్షన్లకు పరిమితమైంది.
అన్ని భాషల్లో ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు అటు విజయ్ దేవరకొండతో పాటు ఇటు పూరీ జగన్నాథ్ కెరీర్ పై ప్రభావం చూపింది. విజయ్ దేవరకొండ ఆరు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను తిరిగిచ్చేశారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. విజయ్ 3 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుని లాభాల్లో వాటా తీసుకోవాలని అనుకున్నారని కానీ సినిమా ఫ్లాప్ కావడంతో నష్టాలే మిగిలాయని తెలుస్తోంది.
మరోవైపు పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు సంబంధించి 40 కోట్ల రూపాయల వరకు నష్టాలను భర్తీ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇందుకోసం లైగర్ రిలీజ్ కు ముందు వచ్చిన లాభాలను వెనక్కివ్వడంతో పాటు ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ వల్ల వచ్చిన లాభాలతో కొన్న ప్రాపర్టీని పూరీ జగన్నాథ్ అమ్మేస్తున్నారని బోగట్టా. తన తర్వాత సినిమాలపై లైగర్ భారం పడకుండా పూరీ జగన్నాథ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరోవైపు పూరీ జగన్నాథ్ తర్వాత ప్రాజెక్ట్ ల గురించి స్పష్టత రావాల్సి ఉంది. తన కొడుకు ఆకాశ్ తో పూరీ జగన్నాథ్ ఒక సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధిస్తే బాగుంటుందని ఈ ప్రాజెక్ట్ ను పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కించవచ్చని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర