కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాటితో సహజీవనం తప్పదని శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో మన జాగ్రత్తలు మనం తీసుకుంటే కరోనా సోకే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. అయితే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాత్ వైరస్‌లకు దూరంగా ఉండటానికి మరో ఆలోచన చెప్పుకొచ్చారు. వైరస్‌ల నుంచి దూరంగా, సంతోషంగా జీవితాన్ని గడపాలంటే ‘ఆఫ్ ది గ్రిడ్ లివింగ్’ను ఆచరించాలని అంటున్నారు. ఇంకా దీని గురించి ఆయనేం చెప్పారంటే…
‘‘నాగరిక ప్రపంచానికి దూరంగా ప్రకృతిలో ఎలాంటి ప్రజా వినియోగాలు లేకుండా బతకడాన్ని ‘ఆఫ్ ది గ్రిడ్ లివింగ్’ అంటారు. నీళ్లు, కరెంటు, గ్యాస్, ఇంటర్నెట్ లాంటి మౌలిక వసతులు లేకుండా జీవించడాన్ని ‘లివింగ్ ఆఫ్ ది గ్రిడ్’ అని పిలుస్తారు. ఇక మూడోది ‘గోయింగ్ ఆఫ్ ది గ్రిడ్’. దీనిని కొంతమందే ఆచరించగలరు. దీని కోసం సరైన ప్రదేశాన్ని చూసుకుని ఇల్లు నిర్మించుకోవాలి. సోలార్ పవర్ లాంటి సోర్సులు ఏర్పాటు చేసుకోవాలి. వర్షం నీటిని సైతం ఉపయోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి’ అని గ్రిడ్ లైఫ్ గురించి చెప్పారు పూరి.
‘‘ఆఫ్ ది గ్రిడ్ లివింగ్’ను ఫాలో అయ్యేవాళ్లు వాళ్ల ఆహారాన్ని వాళ్లే పండించుకుంటారు. కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఫోన్ ఉంచుకుంటారు. పశువులు, కోళ్లను పెంచుకుంటారు. పర్యావరణానికి ఇబ్బంది పెట్టని విధంగా ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు. పశువుల పేడతో గోబర్ గ్యాస్ తయారు చేస్తారు. దాన్నే పంటలకు ఎరువుగానూ వాడతారు. ధాన్యం, మొక్కజొన్న పండించుకుంటారు. వాళ్లది అప్పులు లేని జీవితం. కరెన్సీ అనేది వాళ్ల జీవితంలో ఉండదు. అప్పులవాళ్లు వచ్చి వాళ్ల ఇంటి తలుపులు కొట్టడాలు, నోటీసులు వంటి వాళ్ల జీవితంలో ఉండు’ అంటూ ఆఫ్ ది గ్రిడ్ లివింగ్ గురించి వివరించారు పూరి.
‘‘ప్రపంచంలో 3.5 కోట్ల మంది ‘ఆఫ్ ది గ్రిడ్’ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్లకు పర్యావరణం బాధ్యత ఎక్కువ అని చెప్పొచ్చు. ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. అంతెందుకు మన పూర్వీకులు ఇలాగే ఎన్నో వేల ఏళ్లు బతికారు. అప్పట్లో ‘ఆఫ్ గ్రిడ్ లివింగ్’ను ఎక్కువమంది పాటించడం వల్ల భూమి ఎంతో పచ్చగా ఉండేది. వంద డైనోసార్లు అడవిలో పుట్టి, అదే అడవిలో చనిపోతే ఈ ప్రకృతికి గుర్తుండదు. కానీ నలుగురు మనుషులు బతికి, చనిపోయిన తర్వాత చూస్తే అడవి సగం నరికేసి ఉంటుంది’ అంటూ ప్రకృతి గురించి పూరి చెప్పుకొచ్చారు.
‘‘జీవితంలో ఇలాంటి ఆఫ్ గ్రిడ్ ఇల్లు నిర్మించుకోవాలి. వైరస్‌ల నుంచి దూరంగా సంతోషంగా బతకాలంటే ఇలాంటివే మనకి కావాలి. పట్టణాలకు దూరంగా ఒక ఇంటిని ఏర్పాటు చేసుకోవాలి. మన భవిష్యత్తు మరీ దారుణంగా ఉండనుంది. పిల్లలకు ఏమైనా మంచి చేయాలనుకుంటే అది ఇది మాత్రమే. అక్కడ రోజూ పనిచేసుకుంటూ బతికితే ఎలాంటి జబ్బులు ఉండవు. పోతే వృద్ధాప్యంతో పోతాం. నీటిలో చేపల్లాగా, గాలిలో పక్షుల్లాగా, అడవిలో జంతువుల్లా… ప్రపంచంతో సంబంధం లేకుండా హాయిగా బతికేస్తాం. అందుకే ఆఫ్ ది గ్రిడ్ స్టయిల్లో బతుకుదాం’’అని చెప్పారు పూరి.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!