Liger Movie: ‘లైగర్’ థియేటర్ వద్ద పూరి ఫ్యామిలీ హల్ చల్..!

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘లైగర్‌’ సినిమా నిన్న చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఫామ్లోకి వచ్చిన పూరి… తీసిన సినిమా కావడంతో హైప్ కూడా భారీగా ఏర్పడింది. అభిమానులతో పాటు పూరి కూతురు పవిత్ర కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. థియేటర్లలో విజిల్స్ వేయడానికి రెడీగా ఉన్నట్లు కూడా ఆమె తెలిపింది.

ఆమె చెప్పినట్టుగానే నిన్న ‘లైగర్’ విడుదల రోజున తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూసింది పవిత్ర. పూరి సొంత ఊరు అయిన నర్సీపట్నంలో అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. రాజు థియేటర్‌ వద్ద పూరి అభిమానుల కోలాహలం మధ్య పూరీ జగన్నాథ్‌ సోదరుడు మరియు ఎమ్మెల్యే అయిన పెట్ల ఉమాశంకర్‌ గణేష్.. పూరీ ఫ్యామిలీని సినిమాకి తీసుకెళ్లారు. పూరి సతీమణి లావణ్య, కుమార్తె పవిత్ర, మిగతా కుటుంబ సభ్యులంతా నిన్న రాజు థియేటర్‌లో ‘లైగర్’ చిత్రాన్ని తిలకించారు.

అభిమానులు భారీ ఎత్తున బాణాసంచా పేల్చి చేసిన సందడి వారు . ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నర్సీపట్నం గురించి పూరి జగన్నాథ్ చాలా సందర్భాల్లో గొప్పగా చెప్పాడు.

అతని సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజు నాడు నర్సీపట్నం మరియు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న థియేటర్లకు తన ఫ్యామిలీతో సహా వెళ్లి చూడటం పూరికి అలవాటు. ఈసారి మాత్రం పూరి ఫామిలీ మాత్రమే వెళ్లి ‘లైగర్’ చూసింది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus