Puri Jagannadh: మిర్రరింగ్‌ గురించి.. మీరు ఈ మాట వాడే ఉంటారు!

  • December 11, 2022 / 04:06 PM IST

జీవితాన్ని, జీవిత పాఠాల్ని తన సినిమాల్లో చూపిస్తూ… ‘మనోడు’ అనిపించుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. తనదైన శైలిలో లైఫ్‌ లెసన్స్‌ను వన్‌ లైనర్స్‌లో తన సినిమాలో వినొచ్చు. వాటిని ఆస్వాదిస్తూ.. ఇతరుల మీద ప్రయోగించొచ్చు కూడా. తేనె ముల్లులా సమ్మగా దిగినా.. ఎఫెక్ట్‌, ఇంపాక్ట్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. అచ్చంగా ఆ కాన్సెప్ట్‌ను పూరి మ్యూజింగ్స్‌ పేరుతో పాడ్‌కాస్ట్‌లు, వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఆయన ‘మిర్రరింగ్‌’ గురించి చెప్పారు. వినడానికి కొత్తగా ఉన్నా.. ఇది మనందరికీ బాగా తెలిసిన విషయమే.

అయితే పూరి మాటల్లో వింటే.. ఆ కిక్కే వేరు. కొందరు మనలాగే ప్రవర్తిస్తూ, ‘నువ్వు-నేనూ ఒకటే అన్నా’ అంటూ మనల్ని మోసం చేస్తారు అంటూ ‘మిర్రరింగ్‌’ గురించి చెప్పారు పూరి జగన్నాథ్‌. ‘‘ఆర్నెల్లు సావాసం చేస్తే, వారు వీరు.. వీరు వారు అవుతారని అంటారు. దీన్నే ఇంగ్లీష్‌లో మిర్రరింగ్‌ అంటారు’’ అంటూ చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్‌. ‘‘మనకు నచ్చిన మనిషిని పదే పదే పరిశీలించడంతో మనకు తెలియకుండానే వాళ్ల లక్షణాలు వచ్చేస్తాయి.

అక్కడి నుండి మనమూ వాళ్లలానే ప్రవర్తిస్తాం. వాళ్ల హావభావాలు కాపీ కొడుతుంటాం. మాటకు మాటకూ వాళ్లు ఇచ్చే గ్యాప్‌ లాంటి వాటిని అనుకరించేస్తుంటాం. కొంతమంది వాళ్ల మైండ్‌ కూడా కాపీ కొడతారు. వాళ్లలాగానే ఆలోచిస్తారు. ఆఖరికి ఆహారం కూడా అలాగే తింటారు’’ అంటూ ‘మిర్రరింగ్‌’ గురించి చెప్పారు పూరి. ‘‘మిర్రరింగ్‌’ వల్ల వల్ల ఓ ఇద్దరి మధ్య స్నేహం బలపడుతుంది. ఇది సాధారణంగా సీనియర్స్‌ – జూనియర్స్‌ మధ్య, కపుల్స్‌ మధ్య, ప్రభావంతులైన వారికీ – సాధారణ వ్యక్తుల మధ్య జరుగుతుంది.

‘మిర్రరింగ్‌’ ఇంపాక్ట్‌ వల్ల, మన డ్రెస్సింగ్‌ స్టైల్‌ కూడా మారొచ్చు. ఆలోచనా విధానం కూడా మారొచ్చు. అలా ‘మిర్రరింగ్‌’ ప్రకారం చూస్తే.. పాజిటివ్‌గా ఉండే పీపుల్‌తో తిరిగితే వారిలా పాజిటివ్‌గా ఆలోచిస్తారు. వారిలా ధైర్యంగా ఉంటారు అంటూ ‘మిర్రరింగ్‌’ మ్యూజింగ్‌ను ముగించారు పూరి జగన్నాథ్‌. ఇప్పుడు అర్థమైందా ఆ సావాసరం ఎవరితో చేయాలో, ఎలా చేయాలో.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus