టాప్ హీరోలందరినీ లైన్లో పెట్టేస్తున్న పూరి…!

మొన్నటి వరకూ వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ తో సినిమాలు చెయ్యడానికి పెద్ద హీరోలు ఎవ్వరూ ఆసక్తి చూపేవారు కాదు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాక ఈయనతో సినిమాలు చెయ్యడానికి… టాప్ హీరోలంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా సినిమా చేస్తూ బిజీగా ఉన్న పూరి.. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తుంది.

దానికంటే ముందే మెగాస్టార్ తో ‘లూసీఫర్’ రీమేక్ చేసే ఛాన్స్ లు కూడా ఉన్నాయట. మరోపక్క మహేష్ బాబు తో కూడా సినిమా చెయ్యడానికి పూరి ట్రై చేస్తున్నట్టు సమాచారం. మొన్నటికి మొన్న.. ఇద్దరి మధ్య కాస్త కోల్డ్ వార్ జరిగినా ఇప్పుడు బాగానే ఉంటున్నారని వినికిడి. ఇదిలా ఉంటే… ఇప్పుడు బాలయ్యతో మరోసారి సినిమా చెయ్యడానికి పూరి రెడీ అవుతున్నాడనేది తాజా సమాచారం.

Puri Jagannadh First Movie Details1

గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘పైసా వసూల్’ చిత్రం పెద్దగా ఆడలేదు. కానీ బాలయ్యను చాలా ఎనర్జిటిక్ గా చూపించాడు పూరి. దీంతో ఆయన అభిమానులు కూడా పూరీతో మళ్ళీ బాలయ్య సినిమా చేస్తే చూడాలని ఆశ పడుతున్నారు. పూరి కూడా మంచి కథ రెడీ చేసాడట. బాలయ్య ఓకే చేస్తే ఫైనల్ అయిపోయినట్టే అని తెలుస్తుంది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus