Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 22, 2026 / 06:32 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • పవన్ కళ్యాణ్ బత్తుల (Hero)
  • వైష్ణవి కొక్కుర (Heroine)
  • సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి,వెన్నెల కిషోర్,విషిక కీర్తి,హాసిని సుధీర్,వీటీవీ గణేష్,పమ్మి సాయి, హరితేజ,గబి రాక్ తదితరులు (Cast)
  • వీరు వలవల (Director)
  • కోటేశ్వరరావు బత్తుల (Producer)
  • శ్రవణ్ భరద్వాజ్ (Music)
  • సతీష్ ముత్యాల (Cinematography)
  • కోటి (Editor)
  • Release Date : 22nd మే 2026
  • కళ్యాణ్ ప్రొడక్షన్స్ (Banner)

ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిన్న సినిమాల్లో ‘పురుషః’ ఒకటి. హీరో, హీరోయిన్లు తప్ప మిగిలిన తారాగణం అంతా పెద్దదే. రాజ్ కుమార్ కసిరెడ్డి, సప్తగిరి, వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్ వంటి హ్యాపెనింగ్ ఆర్టిస్టులంతా ఉండటంతో ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడింది అని చెప్పాలి. టీజర్, ట్రైలర్ వంటివి కూడా క్వాలిటీగా అనిపించాయి. మరి సినిమా ఎంతవరకు మెప్పించింది అనేది తెలుసుకుందాం రండి:

Purushaha Movie Review

Purushaha Movie Review and Rating Telugu

కథ: గోవింద్(పవన్ కళ్యాణ్ బత్తుల) ఓ ఫ్యామిలీ థెరపిస్ట్. భార్యా భర్తల మధ్య గొడవలు కనుక వస్తే.. వాళ్ళు విడాకుల వరకు వెళ్లకుండా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాడు. మరోవైపు అతని భార్య కమలతో(వైష్ణవి కొక్కుర) హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే అతని ప్రాణస్నేహితులు థామస్(సప్తగిరి) జంప్(రాజ్ కుమార్ కసిరెడ్డి) మాత్రం తమ భార్యలతో గొడవలు పడుతూ ఉంటారు. వాళ్ళ కారణంగా గోవింద్ ఒకరోజు మందు తాగి ఇంటికి వెళ్తాడు. మద్యం మత్తులో భార్య వద్ద ఫస్ట్ లవ్..ని బయటపెట్టేస్తాడు.దీంతో భర్తతో పెద్ద గొడవ అవుతుంది. ఆమెను కూల్ చేసేందుకు మరో స్నేహితుడు కిస్సు(వెన్నెల కిషోర్) పెళ్ళికి తీసుకువెళ్తాడు. కిస్సు ప్రతి మెమొరీని డైరీలో పిక్చర్ రూపంలో చిత్రీకరించి దాచుకుంటూ ఉంటాడు.గోవింద్, థామస్,జంప్..లు యవ్వనంలో చేసిన చిలిపి పనులకి సంబంధించిన మెమోరీస్ కూడా ఆ డైరీలో ఉంటాయి. ఇవి కాస్త వీళ్ళ భార్యల కంట పడతాయి. దీంతో విడాకులు తీసుకునే రేంజ్..కి వెళ్తుంది విషయం. ఆ తర్వాత ఏమైంది? ఈ ముగ్గురూ తమ భార్యలతో ఎలా కలిశారు? అనేది మిగిలిన కథ.

Purushaha Movie Review and Rating Telugu

నటీనటుల పనితీరు: పవన్ కళ్యాణ్ బత్తుల కొత్త కుర్రాడు. అతని లుక్స్ కొన్ని సీన్స్ లో బాగున్నాయి. అయితే మరీ ‘అతి’కి పోకుండా సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేసిన తీరు అభినందనీయం. హీరోయిన్ వైష్ణవి కొక్కుర లుక్స్ తో ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ రిజిస్టర్ అవుతాయి. రాజ్ కుమార్ కసిరెడ్డి, సప్తగిరి .. తమ మార్క్ కామెడీతో సినిమా మొత్తాన్ని తమ భుజాలపై మోశారు అని చెప్పాలి. వీళ్ళ మార్క్ వన్ లైనర్స్ కూడా బాగా పేలాయి… నవ్వులు పూయించాయి. రాజ్ కుమార్ కసిరెడ్డి భార్య పాత్ర చేసిన విషిక, సప్తగిరి భార్య పాత్ర చేసిన హాసిని సుధీర్.. కూడా అక్కడక్కడా నవ్వులు పూయించారు. వెన్నెల కిషోర్ పాత్ర చిన్నదే అయినా.. ఉన్నంతసేపు నవ్విస్తుంది. ఈ పాత్రని ముగించిన తీరు కొంత డిజప్పాయింట్ చేస్తుంది అనే చెప్పాలి. పమ్మి సాయి, వీటీవీ గణేష్…ల కామెడీ కూడా ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు. హరితేజ, రాజీవ్ కనకాల వంటి నటీనటుల పాత్రలు ఓకే ఓకే అన్నట్టు ఉన్నాయి.

Purushaha Movie Review and Rating Telugu

సాంకేతిక నిపుణుల పనితీరు: కామెడీ ఎంటర్టైనర్లకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలిగిన కామెడీ ఎంటర్టైనర్లు బ్యాలన్స్డ్ గా తీయాలే కానీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే స్టామినా వాటికి ఉంది. అనిల్ రావిపూడి వంటి దర్శకుల సక్సెస్ ఫార్ములా అదే. ‘పురుషః’ విషయంలో దర్శకుడు వీరు వలవల కూడా అనిల్ రావిపూడి పద్ధతినే ఫాలో అయినట్టు అనిపిస్తుంది. సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి..ల పాత్రల కోసం రాసుకున్న కామెడీ ట్రాకులు వర్కౌట్ అయ్యాయి. కొన్ని వన్ లైనర్స్ కూడా పేలాయి.క్లైమాక్స్ లో హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి.. హీరోయిన్ పాత్రని లింక్ చేసిన ఎమోషన్ బాగుంది. కాకపోతే కొన్ని పాత్రలను అర్దాంతరంగా ముగించిన తీరు కొంచెం డిజప్పాయింట్ చేస్తుంది. ఉదాహరణకి వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల వంటి వాళ్ళ పాత్రలకి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు. ఇక ఒకటి, రెండు పాటలు బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమా క్యాస్టింగ్ ని బట్టి నిర్మాణ విలువల విషయంలో ఎటువంటి లోటు చేయలేదని అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని సీన్లకి అనవసరమైన వీఎఫ్ఎక్స్ జోడించారేమో అనిపిస్తుంది. అది మినహాయిస్తే.. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. రన్ టైం కూడా 2 గంటల 19 నిమిషాలే ఉండటం అనేది మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

Purushaha Movie Review and Rating Telugu

విశ్లేషణ: ఈ మధ్య కాలంలో సరైన ఫ్యామిలీ ఎంటర్టైనర్లు రాలేదు. ఆ లోటుని ఫుల్ ఫిల్ చేసే లక్షణాలు ‘పురుషః’ చిత్రానికి ఉన్నాయి.ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులు కచ్చితంగా కాసేపు నవ్వుకుని ఒక శాటిస్ఫేక్షన్ తో బయటకి వస్తారు. సో ఈ వీకెండ్ కి ‘పురుషః’ మంచి ఛాయసే.

Purushaha Movie Review and Rating Telugu

ఫోకస్ పాయింట్: నవ్వించే ఫ్యామిలీ ఎంటర్టైనర్

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anaira Gupta
  • #Gabi Rock
  • #Hasini Sudheer
  • #Kasireddy Rajkumar
  • #Pammi Sai

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

14 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

16 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

17 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

17 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

18 hours ago

latest news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

1 day ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

2 days ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

2 days ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version