Pushpa 2 First Song Promo: ‘పుష్ప 2 ‘ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఎలా ఉందంటే?

నేషనల్ అవార్డు విన్నర్, ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప'(ది రైజ్) 2021 చివర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. హిందీలో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అక్కడ ఏకంగా రూ.108 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించింది. దీంతో ‘పుష్ప 2 ‘ (Pushpa 2: The Rule) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘పుష్ప’ పాటలు కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి అని చెప్పాలి.

‘శ్రీవల్లి’ ‘ఏ బిడ్డ’ ‘ఊ అంటావా’ వంటి పాటలు ఓ ఊపు ఊపేసాయి. ఇక ఆగస్టు 15 న రిలీజ్ కాబోతున్న ‘పుష్ప 2 ‘ మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా మొదలు కాబోతున్నాయి. దేవి శ్రీప్రసాద్‌ (DSP) సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం పాటల్లోంచి మొదటి లిరికల్‌ సాంగ్‌ కి సంబంధించి ఓ ప్రోమోని విడుదల చేశారు. ‘పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్‌’ అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్‌ మంచి హై ఇచ్చేలా ఉంది.

ఆ 19 సెకన్లు ఫైర్ అనే విధంగా ఉంది అని కూడా చెప్పొచ్చు. మే 1న ఉదయం 11:07 నిమిషాలకు కంప్లీట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేస్తారట. సుకుమార్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో రూపొందే సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. కాబట్టి ‘పుష్ప 2 ‘ ఆల్బమ్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.మొదటి సాంగ్ కనుక చార్ట్ బస్టర్ గా నిలిస్తే.. ‘పుష్ప 2 ‘ ప్రమోషన్స్ సగం విజయం సాధించినట్లే అని చెప్పాలి.

https://www.youtube.com/watch?v=l2nmWCKaR-U

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus