Pic Talk : ‘పుష్ప 2’ లో అనసూయ.. మరింత మాస్ గా..!

‘పుష్ప’ (Pushpa) చిత్రం దేశవ్యాప్తంగా మంచి సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) మాత్రమే కాదు.. సునీల్,అనసూయ వంటి నటీనటులకు కూడా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ కి విలన్స్ అంటే మంగళం శ్రీను పాత్ర చేసిన సునీల్ (Sunil) , అతని భార్య దాక్షాయణి పాత్ర చేసిన అనసూయ (Anasuya Bhardhwaj) అనే చెప్పాలి. అయితే క్లైమాక్స్ లో మంగళం శ్రీనుని దాక్షాయణి బ్లేడ్ తో పీక కోసేసినట్టు చూపించారు.

అప్పుడు ‘పుష్ప’ పై పగ తీర్చుకోవడానికి సిద్ధమయ్యేది దాక్షాయణి పాత్ర అని చెప్పాలి. ‘మరి మంగళం శ్రీను పాత్ర ఉంటుందా? లేదా?’ అనేది తెలుసుకోవాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాలి. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈరోజు అనసూయ పుట్టినరోజు. కాబట్టి.. ‘పుష్ప 2 ‘ (Pushpa 2: The Rule) లో ఆమె పాత్ర..అంటే దాక్షాయణి పాత్ర లుక్ ఎలా ఉండబోతుందో ఓ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు మేకర్స్.

ఈ పోస్టర్ ను కనుక గమనిస్తే.. అనసూయ మరోసారి రఫ్ లుక్ లో కనిపిస్తుంది. ఆమె చుట్టూ రౌడీల గుంపు ఉంది. ఆమె మాత్రం పాన్ పరాక్ నవుల్తూ దర్జాగా టేబుల్ పై కూర్చొని రిలాక్స్ అవుతుంది. ఎదురుగా మందు బాటిల్ కూడా ఉంది. సో ‘పుష్ప 2’ లో దాక్షాయణి పాత్రని మరింత మాస్ గా చూపించబోతున్నారు అని స్పష్టమవుతుంది.

https://twitter.com/PushpaMovie/status/1790748329791332513

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus