‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) సినిమాకు ఇప్పటికే కావాల్సినంత బజ్ వచ్చింది. అందుకే టికెట్ రేట్లు ఆకాశాన్నంటేలా ఉన్నా థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అయితే ఆ బజ్‌ను ఇంకాస్త పెంచేలా సినిమా టీమ్ ‘పీలింగ్స్’ సాంగ్‌ను రిలీజ్ చేసింది. పాట సెటప్, మాస్ స్టెప్పులు, ఊర మాస్ గెటప్పులు, రష్మిక (Rashmika Mandanna) అందాల ఆరబోత కలిపి పాట హిట్ కొట్టింది, బజ్‌ను కూడా పెంచింది అని చెప్పాలి. కొచ్చిలో జరిగిన ‘పుష్ప: ది రూల్’ స్పెషల్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) ‘పీలింగ్స్’ పాట గురించి కొంత ఫీలర్ వదిలాడు.
ఈ పాట అన్ని భాషల్లో తొలి లైన్లు మలయాళంలోనే ఉంటాయని, ఇది కేరళ ఫ్యాన్స్‌కి తాను ఇస్తున్న కానుక అని గొప్పగా చెప్పాడు. అనుకున్నట్లుగానే పాట మొదటి లైన్లు మలయాళంలోనే ఉంచారు. అదే పాటకు అందం తీసుకొచ్చాయని చెప్పాలి. మాస్ పాటలకు ట్యూన్‌లు కట్టడంలో దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) దిట్ట అని చెప్పడానికి ఈ పాట మరో ఉదాహరణగా నిలిచింది. ఫుట్ ట్యాపింగ్ మ్యూజిక్‌కి అల్లు అర్జున్, రష్మిక ఊర మాస్ స్టెప్పులు అదిరిపోయాయి.
ఇటీవల కాలంలో ఎప్పుడూ రష్మిక ఇంతటి స్కిన్ షో చేసింది లేదు అని కూడా చెప్పాలి. క్లీవేజ్ డీప్ కట్ వేయించి మరీ కుర్రకారుకు ‘పీలింగ్స్’ తెప్పించారు. మాస్ స్టెప్పుల మధ్యలో కాస్త గ్రేస్ స్టెప్పులు కూడా కలిపి శేఖర్ మాస్టర్ మంచిగా కంపోజ్ చేశారు అని చెప్పాలి. ఇక గంటగంటకు వెంటపడే ప్రేమించే మొగుడితో పడే తిప్పల్ని గీత రచయిత చంద్రబోస్ బాగా వర్ణించారు. ఇక పుష్పరాజ్ గుండెల మీద శ్రీవల్లి తన కాళ్లతో దరువేసిన స్టెప్ పీక్స్.
ఇదంతా చూస్తుంటే ట్రైలర్‌లో చూపించిన కాళ్లతో గడ్డం సవరించుకున్న సీన్ తర్వాత ఈ పాట వస్తుందని చెప్పొచ్చు. మరి థియేటర్స్‌లో ఈ పాటకు జనాల పీలింగ్స్ ఎలా ఉంటాయో తెలియాలి అంటే కొంతమంది నాలుగో తేదీ రాత్రి వరకు ఆగాలి. ఎక్కువ డబ్బులు పెట్టలేని వారు ఐదో తేదీ వేకువజాము వరకు ఆగాలి.