పుష్ప 2: రెమ్యునరేషన్ వల్లే ఆమెను రిజెక్ట్ చేశారట!

ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప 2 (Pushpa 2)  సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్‌ని ఎంపిక చేయాలని మేకర్స్ ప్రయత్నించారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) పేరు ముందుగా చర్చల్లోకి వచ్చింది. శ్రద్ధా ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పి డేట్స్ కూడా కేటాయించింది. అయితే, ఆమె డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ యూనిట్‌కి షాక్ ఇచ్చిందట. శ్రద్ధా కపూర్ ఈ ఒక్క ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలను కోరిందని టాక్.

Pushpa 2

ఈ డిమాండ్ యూనిట్‌ను ఆలోచనలో పడేసింది. మొదట, యూనిట్ ఆమె పారితోషికాన్ని తగ్గించడానికి ప్రయత్నించింది, కానీ శ్రద్ధా తాను కోట్ చేసిన రేటు నుంచి తగ్గకపోవడంతో, యూనిట్ ప్రత్యామ్నాయం కోసం మెఒకరిని వెతకాల్సి వచ్చింది. ఈ క్రమంలో శ్రీలీల (Sreeleela)  పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీలీల, పుష్ప 2 ఐటమ్ సాంగ్‌కి పర్ఫెక్ట్ అనిపించడంతో, యూనిట్ ఆమెను సెలెక్ట్ చేసింది.

శ్రీలీల ఈ సాంగ్ కోసం ఒకటిన్నర కోటి మాత్రమే డిమాండ్ చేయడంతో, మేకర్స్ ఈ ఛాయిస్‌ను ఆమోదించారు. అల్లు అర్జున్‌తో (Allu Arjun) పాటు శ్రీలీల స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని యూనిట్‌కు ధీమా ఉంది. అయితే, ఈ నిర్ణయంపై నార్త్ మార్కెట్ వ్యూహం దృష్ట్యా కొంత భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకొని ఉంటే, పుష్ప 2 కు నార్త్ లో మరింతగా ఆడియెన్స్‌ని ఆకర్షించవచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పైగా, శ్రద్ధా వంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లు ఉండడం వల్ల సినిమాకు అదనపు బిజినెస్‌ కూడా లభిస్తుందని చెబుతున్నారు. మొత్తానికి, అల్లు అర్జున్ క్రేజ్ పైనే భారీ నమ్మకంతో ఉన్న మేకర్స్, శ్రీలీలను ఎంపిక చేశారు. మరి ఈ సెలెక్షన్ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

అఖండ 2 లీక్స్.. ప్లాన్స్ మామూలుగా లేవు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus