2 రోజుల నుండి టాలీవుడ్ అగ్ర నిర్మాతలపై ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ రైడ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది ఈ టైంకి రైడ్స్ జరుగుతుంటాయి. కానీ ఈసారి కొంచెం అవి కఠినంగా జరుగుతున్నాయి. ఐటీ అధికారులు ప్రతి రూపాయికి లెక్కలు అడిగి దర్శకనిర్మాతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దిల్ రాజు (Dil Raju) భార్యని ఏకంగా బ్యాంకు వరకు తీసుకెళ్లి లాకర్లు చెక్ చేయడం, సుకుమార్ ను (Sukumar) ఎయిర్ పోర్ట్ నుండే నేరుగా ఆఫీస్..కి తీసుకెళ్లి సోదాలు నిర్వహించడం వంటివి చూస్తుంటే..
విషయం ఏదో ఉంది అనిపిస్తుంది. మరోపక్క పోస్టర్ పై వేసే గ్రాస్ లెక్కల గురించి కూడా నిర్మాతల్ని ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. ఈ క్రమంలో ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) నిర్మాతలు పోస్టర్స్ పై రూ.1800 కోట్లు గ్రాస్ వచ్చినట్లు పోస్టర్స్ వేసుకున్నారు. కానీ ఆ లెక్కల్లో రూ.531 కోట్లు తేడా వచ్చినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే..
కొంతమంది అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు ‘పుష్ప 2’ సినిమా రూ.2200 కోట్లు కలెక్ట్ చేస్తే.. మేకర్స్ రూ.1800 కోట్లు మాత్రమే గ్రాస్ వేసుకున్నారని.. ఆ రకంగా చూస్తూనే ఇండియాలో నెంబర్ వన్ గా ఉన్న ‘దంగల్’ సినిమా కలెక్షన్స్ ను ‘పుష్ప 2’ క్రాస్ చేసేసింది అని అభిప్రాయపడుతున్నారు.
ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని అల్లు అర్జున్ పీఆర్ టీం కూడా ‘పుష్ప 2’ రూ.2200 కోట్లు కలెక్ట్ చేసినట్లు పోస్టర్ రెడీ చేసి.. పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ తో ప్రమోట్ చేయిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే అసలు విషయం వేరే ఉందని ఇన్సైడ్ టాక్. ‘మైత్రి’ వారు ‘పుష్ప 2’ కి గాను కేవలం రూ.1250 కోట్ల గ్రాస్ కు మాత్రమే టాక్స్ చెల్లించారని అంటున్నారు.
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) January 22, 2025