Pushpa 2 The Rule: పుష్ప 2: హిందీ మార్కెట్ లో పరిస్థితి ఎలా ఉందంటే..!

సౌత్ సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్‌ను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఆ జాబితాలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2 The Rule). అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో రూపొందిన ఈ పాన్ ఇండియన్ మూవీ, డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ భారీ క్రేజ్‌ను తెచ్చుకుంది. అయితే, హిందీ మార్కెట్‌లో చిత్రానికి ఉన్న ప్రీరిలీజ్ బిజినెస్, మ్యూజిక్ అంచనాలపై చర్చ జరుగుతోంది. సినీ విశ్లేషకుల ప్రకారం, హిందీ బెల్ట్‌లో పుష్ప 1 (Pushpa)  మాదిరిగా పుష్ప 2 కూడా రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉంది.

Pushpa 2 The Rule:

ట్రైలర్ అన్ని ప్రాంతాల్లో విపరీతమైన స్పందన పొందినప్పటికీ, ‘పుష్ప 2’ పాటలు హిందీ ఆడియన్స్‌ను పూర్తిగా ఆకట్టుకోలేకపోయాయనే విమర్శలు వస్తున్నాయి. ‘పుష్ప 1’కు సంబంధించిన పాటలు, డైలాగులు దేశవ్యాప్తంగా విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ప్రత్యేకించి, ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా’ పాటలు హిందీ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశాయి. కానీ ‘పుష్ప 2’ సీక్వెల్ సాంగ్స్ ఆ స్థాయిలో వైరల్ కాలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. బాలీవుడ్ సినీ విశ్లేషకులు అధినేత మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ, పుష్ప 2 ట్రైలర్ ఉత్తరాదిన బాగా ఆకర్షించిందని అన్నారు.

కానీ, ఈ సీక్వెల్ పాటలు ముందు భాగంతో పోలిస్తే తక్కువగా నిలిచాయని అభిప్రాయపడ్డారు. హిందీ ప్రేక్షకుల హృదయాలను కదిలించేందుకు మొదటి భాగంలోని మ్యూజికల్ హిట్ ట్రాక్‌లు కీలక పాత్ర పోషించాయి. కానీ ఇప్పుడు అదే స్థాయిలో సీక్వెల్ పనిచేస్తుందా అన్నది సందేహంగా కనిపిస్తోంది. అయితే పుష్ప 2 పై భారీ అంచనాలు మాత్రం ఉన్నాయని ట్రేడ్ పండితులు విశ్వసిస్తున్నారు.

బన్నీ యాక్షన్ సీన్లు, డైలాగులు, అలాగే అతని ప్రత్యేకమైన స్టెప్పులు మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యంగా మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే, హిందీ బెల్ట్‌లో భారీ వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మేకర్స్ కంటెంట్‌తో పాటు మార్కెటింగ్‌లో మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి హిందీ బెల్ట్‌లో ఉన్న ఈ చిన్న సందేహాలను తొలగించి పుష్ప 2 (Pushpa 2 The Rule), బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.

నెట్ ఫ్లిక్స్ బాహుబలి.. అంత ఖర్చు చేసి అలా వదిలేశారేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus